తెలుగుదేశం పార్టీని ఏ రకంగానూ వదలకూడదని భారతీయ జనతా పార్టీ తీర్మానించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ తెలుగుదేశం నాయకులపై కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమైన భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం మంత్రులపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు బీ.వీ.ఎల్.నరసింహారావు వెల్లడించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ పై ఈ కోర్టు అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకున్నారు జీవీఎల్ నరసింహారావు. ఇంతకీ ఏ విషయంలో కోర్టుకు వెళ్తున్నారనుకుంటున్నారా. ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ కంపెనీల పేరుతో జరుగుతున్న కోట్లాది రూపాయల కుంభకోణాలపై తాను కోర్టుకు వెళ్తానని జీవీఎల్ ప్రకటించారు.
వివిధ కంపెనీలకు ప్రోత్సాహకాల పేరుతో షెల్ కంపెనీలు స్రష్టించారని కమలనాధుల ఆరోపణ. దీన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్సడ్డారని తీవ్ర విమర్శలు చేశారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖలో వేలాది కోట్ల రూపాయలు చేతులు మారాయడానికి గడచిన నాలుగేళ్లలో విడుదలైన జీవోలను పరిశీలిస్తే తెలుస్తుందని జీవిఎల్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి.... అవి ఎక్కడెక్కడ వచ్చాయి అనే అంశాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ కంపెనీలు రాకపోయినా - ఉద్యోగాలు ఇవ్వకుండానే కోట్ల రూపాయలు దండుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపైనే ప్రధానంగా కోర్టును ఆశ్రయించాలన్నది జీవీఎల్ నరసింహారావు ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఐటీ కుంభకోణంలో మరో ప్రధాన అంశం ఐటీ కంపెనీలకు ఇచ్చిన భూములను నామమాత్రపు ధరలకు ఇవ్వడమే కాకుండా మూడు సంవత్సరాల తర్వాత వీటిని అమ్ముకోవడానికి కూడా వీలు కల్పించారన్నది ప్రధాన ఆరోపణ.దీని ద్వారా తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకునే వీలు కల్పించే అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ అని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఐటీ శాఖలో ఇప్పటి వరకూ ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని కంపెనీలు ప్రారంభించారు అనే అంశాలపై క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన సమాచారం కూడా ఇవ్వకపోవడం వల్లే తాను కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని కమలనాథుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు.