అగ్ని వలయంలో.. అర్థనగ్నంగా ఆ ఎంపీ ఏం చేశారంటే?

Update: 2020-06-22 03:45 GMT
దేశంలో చాలానే రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ.. బీజేపీకి చెందిన ఎంపీలు కాస్త భిన్నంగా ఉంటారన్నది చెప్పక తప్పదు. లోక్ సభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహించే ఎంపీల్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. తాజాగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీకి చెందిన లోక్ సభ సభ్యుడు ఒకరు చేసిన పని సంచలనంగా మారటమే కాదు.. వైరల్ గా మారారు. ఇప్పటివరకూ మరే ఎంపీ చేయని రీతిలో చేసిన ఆయన పని ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

తన చుట్టూ అగ్ని వలయాన్ని నిర్మించుకొని అర్థనగ్నంగా కూర్చొని యోగా చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రాజస్థాన్ లోని ట్యాంక్ - సవై మథోపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సుఖ్ బీర్ సింగ్. యోగా డే సందర్భంగా ఆయన ఓం నమ: శివాయ అంటూ పలుకుతూ యోగా చేశారు.

అక్కడితో అయ్యగారి యోగా పూర్తి కాలేదు. ఒంటి నిండా బురద పూసుకున్న ఆయన శవాసనం వేశారు. మట్టి స్నానం చేయటం ఆరోగ్యానికి మంచిదన్న ఆయన పని ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. గతానికి భిన్నంగా ఇప్పుడు నెలకొన్న పరిస్థితులతో యోగా డేను ఎవరికి వారు వారి ఇంట్లోనే చేసుకున్నారు. ప్రధాని మోడీ సైతం యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలీ అంటూ వర్చువల్ గానే యోగాడేను పూర్తి చేశారు. ఇలాంటి తీరుకు భిన్నంగా వ్యవహరించిన బీజేపీ ఎంపీ వ్యవహారం ఇప్పుడు మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News