క‌న్నా ఈ స్కెచ్ వేశాడంటే..బాబుకు ముచ్చెమ‌ట‌లే

Update: 2018-05-31 13:57 GMT
ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకునే అవ‌కాశాలు స్పష్టంగా క‌నిపిస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు దాదాపుగా ఏడాది స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ...ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలో రాజ‌కీయ వేడి తారాస్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. పార్టీల‌కు అతీతంగా అన్ని పార్టీలు వ‌చ్చే ఎన్నిక‌ల గురించి ప్ర‌స్తావిస్తున్నాయి. కొన్ని పార్టీలైతే త‌మ‌కే ఓటు వేయాల‌ని..ఇన్ని సీట్లు గెలిపించాల‌ని కూడా కోరుతున్నాయి. ఇలాంటి పొలిటిక‌ల్ హీట్‌ ను మ‌రింత పెంచేందుకు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఓ వైపు ద‌ర్మ పోరాట స‌భ‌లు...ఇటీవ‌ల నిర్వ‌హించిన మ‌హానాడుతో వ‌చ్చే ఎన్నిక‌ల శంఖారావం పూరించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా సంద‌ర్భం ఏదైనా ఆయ‌న త‌న పార్టీకి 25 ఎంపీ సీట్లు రాబోయే ఎన్నిక‌ల్లో క‌ట్ట‌బెట్టాల‌ని ఆయ‌న ప్ర‌తిపాద‌న‌లు కూడా పెడుతున్నారు. మ‌రోవైపు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా ఆయ‌న త‌న ఎన్నిక‌ల అజెండాను వివ‌రిస్తూ అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తానో చెప్పేస్తున్నారు. ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉత్త‌రాంధ్ర‌లో చుట్టేస్తూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్ప‌డ‌మే కాకుండా త‌న‌కు అవ‌కాశం దొరికితే ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తాన‌ని కూడా ప్ర‌క‌టిస్తున్నారు.

ఇలా అధికార‌ - ప్ర‌తిప‌క్షాలు దూకుడుగా సాగుతున్న స‌మ‌యంలో ఏపీలో ఇటీవ‌లి కాలంలో అంద‌రి చూపును త‌న‌వైపు తిప్పుకొన్న బీజేపీపై ప‌డింది. బీజేపీ సిద్ధాంతాల కంటే...ఏపీలో రాజకీయానికే ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇచ్చి పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఆ పార్టీ ఢిల్లీ పెద్ద‌లు ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌టి అంచ‌నాల మ‌ధ్య ఆయన‌ రాష్ట్ర వ్యాప్త ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే పూర్తి ఏర్పాట్లు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా, ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత‌నే క‌న్నా రంగంలోకి దిగి చంద్ర‌బాబుపై ఎదురుదాడి మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. త‌ను ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్లాన‌ని ప్ర‌క‌టించుకునే చంద్ర‌బాబు తీరుపై క‌న్నా విరుచుకుప‌డ్డారు.  ``చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన స‌మ‌యంలో జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారు.. ఏపీలో అసెంబ్లీ సీట్లను ఎప్పుడు పెంచుతారు? అనే అంశాలపైనే ఫోకస్ పెట్టారు` అంటూ క‌న్నా సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు. బ‌స్సు యాత్ర‌తో బాబుపై ఎలా స్పందిస్తారో అనే ఆస‌క్తి స‌హ‌జంగానే క‌లుగుతోంది.
Tags:    

Similar News