బీజేపీకి తిప్పి తిప్పి కొడితే ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్ల శాతమే ఉంది. మహా అయితే రేపటి ఎన్నికల్లో అటూ ఇటూ అవుతుంది తప్ప అంతకంటే అద్భుతాలేవీ జరిగిపోవు. ఇది పక్కా. ఇక ఏపీలో టీడీపీ చూస్తే ఘనమైన పార్టీ నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న గొప్ప పార్టీ. అధినాయకుడు చంద్రబాబు ఏమైనా తక్కువ వారా. ఆయన కూడా నాలుగున్నర దశాబ్దాల నిండైన అనుభవం కలిగిన మేటి నాయకుడు. రాజకీయ చాణక్యుడు అని అందరూ ఆయన్ని అంటారు.
మరో వైపు చూస్తే యువ నాయకుడుగా వైఎస్ జగన్ ఉన్నారు. తండ్రి వైఎస్సార్ కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివిన నాయకుడు. కేవలం పుష్కర కాలం రాజకీయాలతోనే బలమైన నాయకుడిగా ఏపీలో అవతరించిన నేత. దూకుడుకు మారుపేరుగా జగన్ రాజకీయాలు ఉంటాయి. ఎవరినీ లెక్కచేయని తత్వం జగన్ సొంతం. మరి ఈ ఇద్దరు నాయకులే ఏపీలో జనాలకు కనిపించే నేతలు. వీరితోనే ఏపీ రాజకీయం ముడిపడి ఉంది.
అలాంటి ఈ ఇద్దరు నాయకులు మాత్రం బీజేపీకి లోకువ అవుతున్నారా అన్నదే చర్చ. బీజేపీ ప్రతిపాదించిన ద్రౌపది ముర్మునకు బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా నూటికి నూరు శాతం ఓట్లు రాలేదు కానీ ఏపీలో అయితే టోటల్ ఓట్లు అలా పడిపోయాయి. ఏపీలో ఉప్పు నిప్పులా ఉండే జగన్ బాబు బీజేపీ అభ్యర్ధి అనేసరికి మాత్రం పోటీ పడి మరీ మద్దతు ఇచ్చేశారు.
ఒక విధంగా బీజేపీకి అది వరంగా మారింది అనుకోవాలి. ఏపీ బీజేపీ నాయకులు మెమెవరి మద్దతూ అడగలేదు అని కవ్విస్తున్నా కూడా ఏమీ మనసులో పెట్టుకోకుండా మద్దతు ఇచ్చిన ఔదార్యం ఈ ఇద్దరు మహా నాయకులకూ వచ్చింది అంటే కమలానికి వీరెంత లోకువ అయ్యారో అని ఇతర విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. మరి ఇంతటి మద్దతు ఉంటే బీజేపీ ఏపీకి ప్రత్యేకంగా ఏమి చేస్తుంది. ఏ హామీలు అయినా ఎందుకు ఇస్తుంది అన్నది ఒక చర్చ.
మరో వైపు చూస్తే 2024 ఎన్నికలో కూడా ఏపీ వరకూ చూస్తే బీజేపీ బేఫికర్ గా ఉండొచ్చు అని టీడీపీ వైసీపీ గట్టి భరోసా ఇచ్చాయని రాష్ట్రపతి ఎన్నికలు తెలియచేస్తున్నాయి. మేమంటే మేము మద్దతు ఇస్తామని వైసీపీ టీడీపీ పోటీ పడుతూంటే తీసుకునేందుకు బీజేపీకి ఏమి మొహమాటం ఉంటుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇక చూస్తే బీజేపీకి మద్దతు లేదు అని ఈ రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు గట్టిగా చెప్పలేకపోతున్నాయి.
ఏపీలో సోదిలోకి కూడా బీజేపీ లేకపోయినా కూడా ఈ బలమైన పార్టీలు మాత్రం కమలానికి మేము దూరం అని అనలేని దుర్బల స్థితిలో ఉన్నాయి. దానికి కారణం బీజేపీని తాము వదిలేస్ద్తే అవతల పార్టీ నూరు శాతం తన వైపునకు తిప్పుకుంటుందన్న కంగారూ ఆదుర్దా. అదే సమయంలో కేంద్రం మద్దతు లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఏ కొశానా గెలవలేమన్న మరో అపోహ కూడా ఉన్నాయని అనుకోవాలి.
ఎన్నికల వేళ తమ దూకుడు సాగాలన్నా ఆర్ధికంగా తమ జబర్దస్త్ బలాన్ని చూపించుకోవాలన్న కేంద్రంతో నేస్తం కట్టడమే మంచి మారగం అని భావించబట్టే వైసీపీ టీడీపీ కమలం దోస్తీని కోరుకుంటున్నాయి. అయితే బీజేపీకి ఏపీలో ఎవరి మద్దతూ అవసరం లేదని బీజేపీ ఓపెన్ గానే చెప్పేస్తోంది. వారినీ వీరినీ మేము అడిగామా అని ఎకసెక్కమాడుతోంది. మరి ఈ రెండు పార్టీల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని అలా చేస్తోందా అన్న చర్చ కూడా ఉంది మరి. ఏది ఏమైనా 2024లో కూడా బీజేపీకి ఏపీ రాజకీయ పార్టీల మద్దతు ఖాయం. మరి బీజేపీ కి ఏపీ అంటే చులకన భావం ఉండకుండా మరోటి ఉంటుందా.