ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ కాస్త ఆసక్తిగా ఉంది. ఐదో విడత పోలింగ్ లో కీలకమైంది, అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సీట్లలో అయోధ్య అసెంబ్లీ ప్రధానం. ఇక్కడి నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంఎల్ఏ వేద్ ప్రకాష్ గుప్తా పోటీ చేశారు. ఈయనపై ఎస్పీ తరఫున బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన తేజ్ నారాయణ్ పాండే పోటీ చేశారు. మామూలుగా అయితే అయోధ్య అంటే బీజేపీ. బీజేపీ అంటేనే అయోధ్యే గుర్తుకొస్తుంది ఎవరికైనా.
అయోధ్యలో రామ మందిరాన్ని, బీజేపీని విడివిడిగా చూడలేనంతగా ముద్రపడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీచేయటానికి మిగిలిన పార్టీల అభ్యర్థులు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. కానీ బీజేపీ అభ్యర్ధిపై గెలుస్తామని ఎస్పీ అభ్యర్ధి పాండే చెబుతున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. దీనికి కారణం ఏమిటంటే గుప్తాపై జనాల్లో బాగా వ్యతిరేకత ఉందట. అందుకనే ఎన్నికల్లో గుప్తాకు బదులుగా మరో అభ్యర్థిని పోటీలోకి దించమని చాలామంది నేతలు చెప్పినా లాభం లేకపోయింది.
దానికి తోడు గుప్తా కూడా ఎన్నికల ప్రచారంలో కేవలం రామమందిరం నిర్మాణం, నరేంద్రమోడి, యోగి పాలన గురించే ఎక్కువగా ప్రచారం చేశారట. ఎంఎల్ఏ గా ఉండి తాను చేసిన అభివృద్ధి గురించి మాత్రం ఒక్క మాట కూడా చెప్పుకోలేదట. ఇదే సమయంలో ఎస్పీ అభ్యర్ధి పాండే కూడా గుప్తాలోని మైనస్ పాయింట్ల మీద ఎక్కువ గురిపెట్టారట. అలాగే నియోజకవర్గంలోని ముస్లిం, యాదవులు, బ్రాహ్మణుల 1.5 లక్షల ఓట్లపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారట.
పాండే నమ్మకం పెట్టుకున్నట్లుగా ముస్లిం, యాదవ, బ్రాహ్మణ సామాజికవర్గాలు గనుక ఓట్లేస్తే గెలుపు గ్యారెంటీ. ఇదే సమయంలో మోడీ, యోగి చరిష్మా గనుక పనిచేసుంటే గుప్తా గెలుపు ఖాయమనే అనుకోవాలి. మరిద్దరిలో ఎవరి నమ్మకం నిజమవుతుందో ఈనెల 10వ తేదీన కౌంటింగ్ లో తేలిపోతుంది. మొత్తానికి ఈ ఎన్నికల్లో సామాజిక వర్గాల ప్రభావం ఉన్నట్లు గతంలోని ఏ ఎన్నికల్లోను లేదేమో అనిపిస్తుంది. చూద్దాం ఎవరి నమ్మకం నిజమవుతుందో.