కేటీఆర్ సీఎం అంటూ ఇటీవల జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటిఆర్ తెలంగాణ తదుపరి సిఎం అవుతారని కొద్ది రోజులుగా టిఆర్ఎస్ నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్ నుండి ఎర్రబెల్లి వరకు, వారు కెటిఆర్ సీఎం కావాలంటూ మద్దతు పలికారు. రాష్ట్రాన్ని నడిపించే అన్ని సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యంగ్యంగా స్పందించారు. " కేటీఆర్ ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ సిఎం కాలేడు. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాహుల్ గాంధీని ప్రధానిగా చేయని సోనియా గాంధీ చేసిన తప్పును పునరావృతం చేయడానికి కెసిఆర్ ఇష్టపడరు. అందుకే ఇప్పుడు ఈ వాదన తెరపైకి తెచ్చారు..’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాశేశ్వరం ప్రాజెక్టు ఫలితాలతో కేసిఆర్ తాను సంతృప్తి చెందినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన జన్మకు సార్థకత లభించిందన్నారు. ఇదీ తాను కలలుగన్న తెలంగాణ అని, తనకు ఇంకేమీ అవసరం లేదని అన్నారు. మునిసిపల్ ఎన్నికల తరువాత కావచ్చు, లేకపోతే బడ్జెట్ సెషన్ల తరువాత కెసిఆర్ సీఎంగా దిగిపోయి కెటిఆర్ ను సిఎంగా చేసుకోవచ్చు అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఆధారంగానే లక్ష్మణ్ ఈ హాట్ కామెంట్స్ చేశారు.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వ కుట్ర ఉందని, సీనియర్లను పక్కన పెట్టి సోమేష్ కుమార్ ను ప్రధాన కార్యదర్శిగా నియమించడంలో కూడా తప్పు ఉందని బిజెపి నాయకుడు లక్ష్మణ్ ఆరోపించారు. కేటీఆర్ సీఎం ఆశలపై లక్ష్మణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.