అందరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు. మొన్నటి వరకూ మొత్తటి మనిషి.. ఆచితూచి మాట్లాడే నేతగా సుపరిచితుడైన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. ఇటీవల కాలంలో చెలరేగిపోతున్న వైనం తెలిసిందే. లక్ష్మణ్ నోటి నుంచి ఇలాంటి మాటలా? అన్న ఆశ్చర్యానికి గురి చేసేలా ఆయన మాటలు ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని తరచూ నిప్పులు చెరుగుతున్న ఆయన.. తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమంతో పాటు.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తరచూ సీమాంద్ర జలదోపిడీ అని తప్పు పట్టే కేసీఆర్.. ఇప్పుడు ఏపీతో కొత్త సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదన వెనుక మర్మం ఏమిటి? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. మన నీటిని సీమాంధ్ర దోచుకుంటుందని గతంలో ఆరోపించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు కొత్త ప్రాజెక్టు ప్రతిపాదన వెనుక మర్మం ఏమిటి?.. ఆ మతలబు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రాజెక్టులకు.. కల్వకుంట్ల కుటుంబానికి ప్రయోజనం కలిగించే పనులకే నిధులు విడుదల చేస్తున్నారని ఆరోపించిన లక్ష్మణ్.. అలాంటి ప్రాజెక్టుల్ని నిర్మించ తలపెడితే మాత్రం అడ్డుకుంటామన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ ను అఖిలపక్ష సమావేశం ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. నీళ్లు.. నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగితే.. ఇప్పుడు వాటినే టీఆర్ ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు.
బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అప్పుల ఊబిలో నెట్టారని కేసీఆర్ తీరును తప్పుపట్టారు. కొత్త ప్రాజెక్టుల గురించి కబుర్లు చెబుతున్న కేసీఆర్..రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు పథకాలకు నిధులు ఇవ్వకపోగా.. బకాయిల్ని తీర్చటం లేదని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వటం లేదని.. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం రూ.420 కోట్లు బకాయిలు పడినట్లు చెప్పారు.
లక్షా పన్నెండు వేల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని ఆరేళ్ల క్రితం తొలి అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్.. ఇప్పటివరకూ పాతికవేల ఉద్యోగాల్ని మాత్రమే భర్తీ చేశారన్నారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని.. వారంతా రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబంలో మాత్రమే కొలవులన్నీ భర్తీ అయ్యాయని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అంతకంతకూ పదును తేలుతున్న లక్ష్మణ్ వ్యాఖ్యలపై కేసీఆర్.. కేటీఆర్ ఇద్దరిలో ఏ ఒక్కరూ ఇటీవల కాలంలో రియాక్ట్ కాకపోవటం ఆసక్తికరంగా మారింది.