మహారాష్ట్రలో వైదొలిగిన బీజేపీ..

Update: 2019-11-07 09:34 GMT
మహారాష్ట్ర లో అధికారం చేపట్టే యోచనను బీజేపీ విరమించుకోవాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. గవర్నర్ తో ఈ మధ్యాహ్నం బీజేపీ ప్రతినిధి బృందం భేటి కావాల్సి ఉంది. అయితే ఈ భేటిని అర్ధాంతరంగా బీజేపీ వాయిదా వేసుకుంది.  ఇక సాయంత్రం లోగానే గవర్నర్ తో భేటికి బీజేపీ రెడీ అయ్యింది. అయితే అనూహ్యంగా ఈ భేటిలో మహారాష్ట్ర సీఎం, బీజేపీ నాయకుడు ఫడ్నవీస్ పాల్గొనడం లేదని బీజేపీ సంచలన ప్రకటన చేసింది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను విరమించుకున్నట్టు స్పష్టమవుతోంది. మెజారిటీ లేకపోవడం.. శివసేన మోకాలడుతుండడంతోనే మహారాష్ట్ర లో బీజేపీ సర్కారు ఏర్పాటు ఆలోచనను విరమించుకున్నట్టు అర్థమవుతోంది.

కాగా శివసేన మాత్రం ధీమాతో ఉంది. మహారాష్ట్ర సీఎంగా తమ నేతే అవుతారని తాజాగా శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే ప్రకటించారు. ఎమ్మెల్యే లను రిసార్ట్ లకు తరలించాల్సిన అవసరం మాకు లేదని శివసేన స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారం చేసే ముందు బీజేపీ వాళ్లే వారి ఎమ్మెల్యేలను చూసుకోవడం మంచిదని శివసేన సెటైర్లు వేసింది.

శివసేన సీఎం పీఠం కోరుతుండడం.. ఎంతకు దిగిరాకపోవడం.. బీజేపీకి మెజార్టీ లేక పోవడంతో ఇక ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను బీజేపీ విరమించుకున్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News