శ‌ర‌వేగంగా మారుతోన్న క‌న్న‌డ రాజ‌కీయం

Update: 2018-05-15 10:49 GMT
క‌ర్ణాట‌క‌లో అస‌లు రాజ‌కీయం ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. నోటి వ‌ర‌కూ వ‌చ్చిన ముద్దు నోట్లోకి వెళ్ల‌క‌పోతే ఎలా ఉంటుందో బీజేపీకి ఇప్పుడు అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి. అదే స‌మ‌యంలో గోవా.. మ‌ణిపూర్ ల‌లో ఎదురైన చేదు అనుభ‌వాల దృష్ట్యా.. క‌ర్ణాట‌క పీఠాన్ని ఏమైనా స‌రే బీజేపీకి ద‌క్కకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేసింది. మెజార్టీ ప‌క్కా.. మేజిక్ ఫిగ‌ర్ సొంత‌మైంద‌న్న సంతోషం లేకుండా క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు బీజేపీకి 104 సీట్ల‌ను మాత్ర‌మే ఇవ్వ‌టంతో.. సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేని ప‌రిస్థితి. దీంతో.. ఎవ‌రో ఒక‌రి సాయం తీసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి.

మ‌రోవైపు ఇత‌రులు సైతం ఇద్ద‌రు మాత్ర‌మే ఉండ‌టంతో.. మూడో అతి పెద్ద పార్టీ అయితే జేడీఎస్ స‌హ‌కారం తీసుకోవ‌ట‌మో లేదంటే.. ఆ పార్టీని నిట్ట‌నిలువునా చీల్చ‌టం త‌ప్పించి బీజేపీకి మ‌రో ఆప్ష‌న్ లేని ప‌రిస్థితి. బీజేపీ ప‌రిస్థితి ఇలా ఉంటే.. అర‌కొర సీట్లు వ‌చ్చిన నేప‌థ్యంలో..  కీల‌కంగా మారిన జేడీఎస్ కు అధికారాన్ని చేతికి ఇచ్చేసి.. తాము బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తు ఇచ్చేలా కాంగ్రెస్ పావులు క‌దప‌టం షురూ చేసింది.

ఎప్పుడూ అంత త్వ‌ర‌గా స్పందించ‌ని సోనియా సైతం.. ఓప‌క్క ఓట్లు లెక్కింపు సాగుతుండ‌గానే.. సీన్లోకి వ‌చ్చేశారు. జేడీఎస్ పెద్ద‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారు. సోమ‌వారం రాత్రే బెంగ‌ళూరుకు చేరుకున్న టాస్క్ మాస్ట‌ర్లు అజాద్‌.. గెహ్లాట్ లు జేడీఎస్ కు అధికారాన్ని అప్ప‌గించే దిశ‌గా పావులు క‌దుపుతున్నారు.

క‌ర్ణాట‌క పీఠాన్ని సొంతం చేసుకున్నామ‌న్న సంతోషంలో పండ‌గ చేసుకుంటున్న బీజేపీ శ్రేణుల‌కు షాకులు త‌గిలేలా తాజా ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టంతో సీన్ మొత్తం మారిపోయింది. విజ‌యానందం క‌రిగిపోయి.. అస‌లేం జ‌రుగుతుంద‌న్న ఉత్కంట మొద‌లైంది. బీజేపీ నేత‌ల బ‌డాయి మాట‌లు త‌గ్గి.. కాంగ్రెస్ కు కౌంట‌ర్ ప్లాన్ చేసేందుకు బీజేపీ నేత‌లు రంగంలోకి దిగారు.

జేడీఎస్ కు అధికారాన్ని ఇచ్చేయ‌టం ద్వారా ప్ర‌త్య‌ర్థిని దెబ్బేయాల‌ని కాంగ్రెస్ భావిస్తుంటే.. దానికి విరుగుడుగా  కాంగ్రెస్ న‌మ్ముకున్న జేడీఎస్ ను అడ్డంగా చీల్చేసి.. త‌మ ప‌బ్బం గ‌డుపుకుంటే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో బీజేపీ పెద్ద‌లు ఉన్న‌ట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ తో జ‌ట్టు క‌ట్టేందుకు దేవెగౌడ కొడుకు రెవ‌ణ్ణ   స‌సేమిరా అంటున్న‌ట్లుగా తెలుస్తోంది.  ఈ విష‌యాన్ని గుర్తించి బీజేపీ పెద్ద‌లు.. జేడీఎస్ ను నిట్ట‌నిలువుగా చీల్చేసి.. ప‌దిహేను నుంచి 20 మంది ఎమ్మెల్యేల్ని తీసుకొచ్చే బాధ్య‌త‌ను రేవ‌ణ్ణ‌కు అప్ప‌జెప్పిన‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల విశ్లేష‌ణ‌. ఇందులో నిజం ఎంత‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. అయితే.. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా బీజేపీ నేత‌ల మాట‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. జేడీఎస్ కు అధికారాన్ని అప్ప‌గించాల‌న్న కాంగ్రెస్ వ్యూహానికి త‌మ ద‌గ్గ‌ర విరుగుడు ఉందంటూ బీజేపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌లు చూస్తే.. జేడీఎస్ నిట్ట‌నిలువునా చీలిపోతుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. మరోవైపు.. ఎట్టి ప‌రిస్థితుల్లో బీజేపీకి అధికారాన్ని ద‌క్క‌కుండా చేయ‌టానికి కాంగ్రెస్ పెద్ద‌లు రంగంలోకి దిగి.. బిజీబిజీగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఇదిలాఉంటే.. బీజేపీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా చెప్పే య‌డ్యూర‌ప్ప ఇంటి వ‌ద్ద భ‌ద్ర‌త‌ను ఒక్క‌సారిగా పెంచ‌టం మ‌రింత  ఆస‌క్తిక‌రంగా మారింది. అంత‌కంత‌కూ ఆస‌క్తిక‌రంగా మారిన క‌ర్ణాట‌క రాజ‌కీయం ఏ ద‌రికి చేరుతుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్నైంది.

Tags:    

Similar News