తెలంగాణాలో బీజేపీలో మంటలు పుట్టాయి. పొత్తుల మ్యాటర్ తో కమలం పార్టీలో నేతలు తలోరకంగా స్పందిస్తున్నారు. మాజీ ఎంపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న బీజేపీ నాయకురాలు విజయశాంతి సహా పలువురు సీనియర్లు పొత్తుల మీద మండిపడుతున్నారు. ఈ రకమైన ప్రచారం ఎందుకు సాగుతోందని ఆమె తెలంగాణా బీజేపీ పార్టీ సమావేశంలో అధ్యక్షుడు బండి సంజయ్ ని నిలదీశారు.
అసలు పొత్తులు ఉంటాయా లేదా ఎందుకు ఈ రకంగా జనంలోకి వెళ్తోంది స్పష్టత ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. 2018లో తెలుగుదేశంతో కలసి వెళ్ళిన కాంగ్రెస్ అన్ని రకాలుగా దెబ్బ తిన్న సంగతిని విజయశాంతిని గుర్తు చేశారు. పొత్తులు వద్దు అని ఆమె గట్టిగా చెప్పారు. దాని మీద బండి సంజయ్ మాట్లాడుతూ తెలుగుదేశంతో ఏ రకమైన పొత్తు ఉండదని క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సినది లేదని, క్యాడర్ కి కూడా ఇదే విషయాన్ని చెప్పాలని ఆయన కోరారని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్యనే ఖమ్మంలో తెలుగుదేశం తెలంగాణా శాఖ భారీ సభను నిర్వహించింది ఆ సభలో చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణాకు తెలుగుదేశం పార్టీ చేసింది ఎంతో ఉందని అన్నారు.
తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయాలని ఆయన నిర్ణయించారు. ఆయన ఆలోచనల మేరకు చూస్తే తెలంగాణాలో తెలుగుదేశం బలపడితే బీజేపీతో పొత్తు పెట్టుకుని దాన్ని ఆంధ్రాకు విస్తరించవచ్చు అన్నది అజెండా. ఆ రకంగా ఏపీలో వైసీపీని దెబ్బ తీయాలన్నది బాబు మార్క్ ప్లాన్. అయితే దీనికి ఆది నుంచి చాలా మంది బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారు.
సీనియర్ నేతలు ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దల వద్ద పలుకుబడి ఉన్నా వారు సైతం పొత్తులు వద్దే వద్దు అంటున్నారు. అయితే తెలనగణా బీజేపీ ప్రెసిడెంట్ సహా కొందరు కీలక నేతలు మాత్రం తెలుగుదేశంతో పొత్తు రాజకీయంగా బీజేపీకి లాభిస్తుంది అని భావిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. దాంతోనే ఇపుడు తెలంగాణాలో తెలుగుదేశం బీజేపీల మధ్య పొత్తు అన్న చర్చ వస్తోంది.
దాంతో బీజేపీ సమావేశంలో ఈ సంగతి తేల్చాలంటూ విజయశాంతి పట్టుబట్టడం, దానికి నిజమాబాద్ ఎంపీ అరవింద్ కూడా మద్దతు ఇవ్వడంతో బండి సంజయ్ పొత్తులు అన్నవే లేవని తేల్చేశారు. ఒంటరిగానే తెలంగాణాలో బీజేపీ పోటీ చేస్తుంది అని ఆయన స్పష్టత ఇచ్చారు. అయితే బండి సంజయ్ ఈ మాటలు చెప్పినా కేంద్ర బీజేపీ పెద్దల మదిలో ఏముందో కూడా చూడాలని అంటున్నారు. మోడీ అమిత్ షా స్థాయిలో కనుక తెలుగుదేశం బీజేపీల మధ్య తెలంగాణా పొత్తు కనుక ఆమోదముద్ర పడితే ఎవరు కాదన్నా ముందుకు కలసి నడవాల్సిందే అంటున్నారు. మొత్తానికి చూస్తే తెలంగాణా బీజేపీలో తెలుగుదేశం పొత్తుల మంటలు స్టార్ట్ అయ్యాయనుకోవాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.