బీఎండబ్ల్యూ లో 6 వేలమంది ఉద్యోగాలు కోత

Update: 2020-06-21 07:30 GMT
ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వైరస్ ప్రభావం దాదాపు కనిపిస్తోంది. లక్షలమందికి మహమ్మారి రావడంతో పాటు, 4 లక్షల మందికి పైగా చనిపోయారు. ఈ విషయం పక్కన పెడితే అగ్రదేశం అమెరికా, చైనా వంటి వివిధ దేశాల్లో కోట్లాది లక్షలాది ఉద్యోగాలు ఊడిపోతాయని అంచనా. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం కారణంగా లాక్ డౌన్ విధించడంతో సంస్థలు దివాళా తీసే స్థితికి చేరుకున్నాయి. దినీటి చాలా సంస్థలు జీతాలు ఇవ్వలేక ఉద్యోగుల పై వేటు వేస్తున్నారు. దీనితో చాలామంది నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలు తమ ఉద్యోగులకి ఉద్వాసన పలకగా...తాజాగా ఆ లిస్ట్ లో తాజాగా బీఎండబ్ల్యూ కూడా చేరిపోయింది.
 
పూర్తి వివరాలు చూస్తే ..వైరస్ కు సంక్షోభం లో ఆర్థికకష్టాల నుంచి బయటపడేందుకు జర్మన్ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూ కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా ఉద్యోగాల కోత కు రెడీ అయ్యింది. వార్షిక టర్నోవర్ తో పాటు కొత్త కార్లకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఆరువేల మంది ఉద్యోగులను ముందస్తు పదవీ విరమణ పై త్వరలో ఇంటికి పంపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్పష్టంచేసింది.
Tags:    

Similar News