ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల కేసు విచారణలో భాగంగా నేడు సుప్రీం కోర్టు లో ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ ఆమోదించిన మూడు రాజధానుల బిల్లులపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో పై సవాల్ చేసిన జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై నేడు విచారణ ఛీఫ్ జస్టిస్ బాబ్డేతో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, వి రామసుబ్రహ్మణియన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ పారంబించింది. అయితే అదే సమయంలో సీనియర్ లాయర్ రంజిత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో దీనిపై నేడు సుప్రీం లో ఎదో ఒకటి తేలుతుంది అని భావించినప్పటికీ ఎల్లుండికి వాయిదా పడింది.
అసలు సీనియర్ లాయర్ రంజిత్ కుమార్‌లేవనెత్తిన ఆ అంశం ఏమిటి అంటే .. ఏపీ హైకోర్టులో రాజధాని రైతుల తరఫున దాఖలైన పిటిషన్లలో సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే కూతురు వాదిస్తున్నట్లు అయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో తానుఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు బాబ్డే ప్రకటించారు. అలాగే , కేసును వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని సుప్రీం రిజిస్ట్రార్ ను ఆదేశిస్తూ బుధవారానికి విచారణ వాయిదా వేశారు. రైతుల తరఫున కింది కోర్టులో వాదిస్తున్న లాయర్ తన కూతురే కాబట్టి ఈ కేసులో తాను ఇచ్చే ఆదేశాలపై ఆ ప్రభావం పడకుండా జస్టిస్ బాబ్డే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, రైతులతో పాటు పలువురు ఈ కేసు విచారణను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కీలక కేసు కావడంతో ధర్మాసనం కేటాయింపుతో పాటు మిగతా విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే బాబ్డే కుటుంబ సభ్యులు హైకోర్టులో వాదిస్తున్నారన్న విషయం తెలియగానే ఆయన వెంటనే ఈ కేసు విచారణ నుండి తప్పుంకుంటున్నట్టు తెలిపారు. అయన తప్పుకోవడంతో ఈ కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది.