న్యూయార్క్ లో కరోనా మృతదేహాల సామూహిక ఖననం

Update: 2020-04-10 11:10 GMT
అమెరికాలోని ఆర్థిక రాజధాని న్యూయార్క్ కరోనాతో శవాలదిబ్బగా మారిపోతోంది. న్యూయార్క్ లో ఇప్పటికే లక్షా59వేల మందికి కరోనా సోకింది. దాదాపు 7067 మంది మృతిచెందారు. అమెరికా మొత్తం మీద ఒక్క న్యూయార్క్ లోనే 40శాతంపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ మరణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.

న్యూయార్క్ లో రోజుకు 1500 మందికిపైగా మరణాలు సంభవిస్తుండడంతో సాధారణ శ్మశనావాటికలు, అంత్యక్రియలు నిర్వహించే వ్యవస్థలు నిండిపోయాయి. దీంతో శవాలను ఖననం చేసే వీలులేక ఏం చేయాలో పాలుపోక మార్చురీలలో శవాలను భద్రపరుస్తున్న దుస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులు - బంధువులు కూడా శవాలను తీసుకుపోవడం లేదు.. చూడడం లేదు. దీంతో ప్రభుత్వమే  మృతదేహాలను తెలుపురంగు బాక్సుల్లో ఒకదానిపై ఒకటి పేర్చి అంత్యక్రియలు నిర్వహిస్తోంది.

న్యూయార్క్ నగరంలో మృతదేహాలను పూడ్చిపెట్టడానికి స్థలం లేకపోవడంతో దగ్గరలోని హార్ట్ ఐలాండ్ లో సామూహిక ఖననం చేస్తున్నారు. క్రేన్లతో శవాలను తీసుకెళ్లి పెద్ద గుంతలు తవ్వి వారిని అలాగే భూమిలో పాతిపెడుతున్నారు. ఇలా న్యూయార్క్ లో శవాలను ఖననం చేయడానికి కూడా స్థలం లేక ఐలాండ్ లో ఖననం చేస్తున్న దారుణ స్థితి నెలకొంది.


Full View

Tags:    

Similar News