ఏపీ మంత్రివర్గ విస్తరణ రచ్చ ఇంకా నడుస్తూనే ఉంది. అంసతృప్తుల ఆగ్రహ జ్వాలలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి కావటం తెలిసిందే. అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు తన వర్గాన్ని రంగంలోకి దించిన చంద్రబాబు.. యుద్ధప్రాతిపదిక మీద ప్రయత్నాలు చేసినప్పటికీ తమ్ముళ్ల ఆగ్రహ జ్వాలలు ఒక కొలిక్కి వచ్చేందుకు దాదాపు మూడు.. నాలుగు రోజుల దాకా పట్టిన దుస్థితి. బాబు లాంటి మొనగాడు అధినేతకు.. తమ్మళ్ల అసంతృప్తి జ్వాలను చల్లార్చేందుకు ఇంత సమయం పట్టిందా? అన్న విస్మయం వ్యక్తమైంది.
ఇదిలా ఉంటే.. మంత్రివర్గం నుంచి తొలగించిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అగ్గి ఫైర్ అయి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదన్న అభిప్రాయం ఉంది. దీనికి మరింత బలాన్ని చేకూరుస్తూ తాజాగా బొజ్జల చేసిన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. మంత్రివర్గం నుంచి తనను తొలగించటం చాలా బాధగా ఉందని ఆయన తాజాగా మరోసారి వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంపై ఈ నెల 15న తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. తాను అనారోగ్యంతో ఉన్న విషయం వాస్తవమేనని.. ఆ కారణంగా మంత్రివర్గం నుంచి తొలగించటం సరికాదన్నారు. కార్యకర్తలతో త్వరలో సమావేశం కానున్నట్లు చెప్పిన బొజ్జల.. మంత్రివర్గం నుంచి తొలగించిన నిర్ణయానికి బాధపడే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లుగా చెప్పారు. రాజీనామాపై తుది నిర్ణయాన్ని ఈ నెల 15న చెప్పనున్నట్లుగా ప్రకటించటం ద్వారా.. విస్తరణ చిచ్చు ఇంకా చల్లారలేదన్న విషయాన్ని మరోసారి చెప్పినట్లైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/