ఆర్యన్ ఖాన్‌ కు చుక్కెదురు.. విషాదంలో షారుఖ్

Update: 2021-10-27 04:01 GMT
బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ కు ముంబై హైకోర్టులో చుక్కెదురైంది. నౌకలో డ్రగ్స్‌ రేవ్‌ పార్టీ కేసులో బాలీవుడ్‌ బాద్‌ షా షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ పై ముంబై హైకోర్టు నేడు (మంగళవారం) వాదనలు ముగిశాయి. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఆర్యన్ ఖాన్ ను విడిపంచేందుకు షారూఖ్‌ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్‌డిపిఎస్ చట్టం కింద ప్రత్యేక కోర్టు ఈనెల 20వ తేదీన ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఆర్యన్ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మొదటి సారి ఆర్యన్ ఖాన్ తరపున భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆర్యన్‌ ను ఎన్సీబీ అరెస్ట్‌ చేసిందని వాదించారు. క్రూయిజ్‌ లో పార్టీ కి గెస్ట్‌ గా మాత్రమే ఆర్యన్‌ వెళ్లాడని, ముకుల్ రోహత్గీ తెలిపారు. కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేదికి గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆర్యన్ ఖాన్ కేసు కూడా అలాంటిదేనని ఆయన వివరించారు. రోహత్గీ, ఎన్సీబీ అధికారుల్ని టార్గెట్ చేశారు. తన ముద్దాయికి బెయిల్ ఇవ్వకుండా అడ్డుకునేందుకు ఎన్సీబీకి చట్టపరమైన అవకాశాలు లేవని రోహత్గీ స్పష్టం చేశారు.

ఆర్యన్ ఖాన్ వాట్సప్ చాట్స్ గురించి రోహత్గీ వాదన వినిపించారు. ఆర్యన్ వాట్సప్‌ లో ఎక్కడా క్రుయిజ్ పార్టీ గురించి లేదని తెలిపారు. అవన్నీ పార్టీ కంటే ముందు జరిపిన సంభాషణలు మాత్రమేనని కోర్టు దృష్టికి ఆయన తీసుకువచ్చారు. ఆర్యన్‌ ను అరెస్ట్‌ చేసి 23 రోజులయ్యిందని తెలిపారు. ఇప్పటికీ ఎన్సీబీ ఆయన దగ్గర ఎలాంటి డ్రగ్స్‌ ను స్వాధీనం చేసుకోలేకపోయిందని చెప్పారు. గతంలో ఆర్యన్‌ కు నేరచరిత్ర లేదని రోహత్గీ గుర్తుచేశారు. కుట్రలో భాగంగానే ఆర్యన్‌ను అరెస్ట్‌ చేశారని తెలిపారు. వైద్య పరీక్షల్లో ఆర్యన్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిర్ధారణ కాలేదని ఆయన పేర్కొన్నారు.

ఆర్యన్‌ కు బెయిల్‌ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందని ఎన్సీబీ బెయిల్‌ ను వ్యతిరేకిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. డ్రగ్స్‌ కేసులో సాక్షి గా ఉన్న ప్రభాకర్‌ సెయిల్‌ వ్యవహారాన్ని ఎన్సీబీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ రాకెట్‌ తో ఆర్యన్‌ కు సంబంధాలు ఉన్నాయని ఎన్సీబీ అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే ఎన్సీబీ లో జరుగుతున్న గొడవతో తనకు సంబంధం లేదని ఆర్యన్‌ చెప్పాడు. వాట్సాప్‌ చాట్స్‌ ను పరిగణలోకి తీసుకోవద్దని అఫిడవిట్‌ లో కోరాడు. సాక్షులతో తనకు ఎలాంటి సంబంధాలు స్ఫష్టం చేశాడు.

ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన వెంటనే మొదటి మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సాంకేతిక కారణాలతో కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. మేజిస్ట్రేట్ కోర్టు పరిధిలో లేనందున ఆర్యన్ బెయిల్ రద్దయింది. అనంతరం సెప్టెంబర్ 13,14వ తేదీల్లో ప్రత్యేక కోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ పై విచారణ జరిగింది. ఆర్యన్ ఖాన్ తరపున సీనియర్ లాయర్ అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ప్రత్యేక కోర్టు 20వ తేదీన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆ మరుసటి రోజే ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ముంబై హైకోర్టు మెట్లెక్కాడు.
Tags:    

Similar News