అమెరికాలో కురుస్తున్న దట్టమైన మంచు తుపాను ధాటికి తెలుగు ఎన్నారై దంపతులు మృతిచెందారు. ‘బాంబ్ సైక్లోన్’గా పేర్కొంటున్న ఈ భారీ హిమపాతానికి గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన మద్దన నారాయణ తన భార్య హరిత, ఇద్దరు పిల్లలతో కలిసి న్యూజెర్సీలో నివాసం ఉంటున్నాడు.
న్యూజెర్సీలో కురుస్తున్న బాంబు సైక్లోన్ మంచు తుఫాన్ దృశ్యాలను వీక్షించే క్రమంలోనే ఒక ఐస్ లేక్ లో ఫొటోలు తీసుకునేందుకు వెళ్లిన దంపతులు అనుకోకుండా ఆ మంచు ఫలకం కుప్పకూలడంతో అందులో పడిపోయారు.
గడ్డకట్టిన ఒక భారీ ఐస్ క్యూబ్ పై నిలబడి ఫొటోలు తీసుకునే క్రమంలోనే ఐస్ గడ్డ ఒక్కసారిగి కుంగిపోయింది. దీంతో ముద్దన నారాయణ, హరిత దంపతులు ఇద్దరూ ఐస్ గడ్డపై నుంచి కిందపడి ఐస్ లేక్ లో కింది భాగంలో చిక్కుకుపోయారు.
ఐస్ లేక్ కావడం.. ఎడతెరపి లేని మంచు కురుస్తుండడంతో ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరూ బతికే ఛాన్స్ లేకుండాపోయింది. ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకుండాపోయింది. ఈ రెస్క్యూలో హరిత మృతదేహం లభించగా.. నారాయణ మృతదేహం కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు.
ఇక దంపతులు ఇద్దరూ ఫొటోలు తీసుకునేందుకు వెళ్లే క్రమంలో పిల్లలు ఇద్దరినీ ఒడ్డున వదిలి వెళ్లారు. అదృష్టవశాత్తూ ఆ ఇద్దరూ ఒడ్డునే నిలబడి ఉండడంతో వారు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయి పిల్లలు ఇద్దరినీ అనాథలుగా చేయడం బంధుమిత్రులను కంటతపడి పెట్టింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.