కొడాలి నాని, వంశీల‌ను జూనియ‌ర్ వేసెయ్యాలా ఏంటి?

Update: 2022-02-11 14:30 GMT
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పైర్ బ్రాండ్ బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌ర చుగా త‌న వ్యాఖ్య‌ల‌తో మీడియాలో నిలిచే బొండా ఉమా.. మ‌రోసారి త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. ము ఖ్యంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ నేని వంశీ, మంత్రి కొడాలి నాని ఇద్ద‌రూ కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌నుషులేన‌ని వారి వెనుక‌... జూనియ‌ర్ ఉన్నార‌ని అన్నారు. అంతేకాదు.. ప్ర‌త్యేకంగా వారికోసం.. జూనియ‌ర్ చాలానే చేశార‌ని బొండా చెప్పారు.

మంత్రి కొడాలి నానికి .. గ‌తంలో ఎమ్మెల్యే టికెట్‌, వంశీకి.. ఎంపీ టికెట్ కూడా జూనియ‌రే ఇప్పించార‌ని.. అన్నారు. అంతేకాదు.. 2014, 2019 ఎన్నిక‌ల్లో జూనియ‌ర్ ఎక్క‌డా త‌మ‌కు ప్ర‌చారం చేయలేద‌న్నారు. కాబ‌ట్టి.. లోకేష్ కుఉన్న ప్రాధాన్యం.. జూనియ‌ర్‌కు ఎలా ఉంటుంద‌ని చెప్పారు. ఆయ‌న ప్ర‌స్తుతం సినిమాల కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యార‌ని.. కాబ‌ట్టి ఆయ‌న పార్టీలో యాక్టివ్ అయిన త‌ర్వాత‌.. ఎవ‌రు ఏంటి? అనే విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తుంద‌న్నారు. ప్ర‌స్తుతం లోకేష్ స‌మ‌ర్ధుడ‌నే వ్యాఖ్య‌ల‌తో తాను ఏకీభ‌విస్తాన‌ని చెప్పారు. జూనియ‌ర్‌పార్టీలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. చూద్దామ‌ని.. ఇప్పుడు మాత్రం లోకేష్‌తో కంపేర్ చేయలేమ‌న్నారు.

ఇక‌, చంద్ర‌బాబు కుటుంబంపై అసెంబ్లీలో కొంద‌రు చేసిన వ్యాఖ్య‌ల అనంత‌రం.. జ‌రిగిన ప‌రిణామాల‌పై ఉమా మాట్లాడుతూ.. కొడాలి నాని, వంశీల‌ను హెచ్చ‌రించ‌డంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఉదాశీనంగా వ్య‌వ‌హ రించార‌ని అన్నారు. అంతేకాదు, సుతిమెత్త‌గా ఉన్నార‌ని.. కాబ‌ట్టి వారి వెనుక‌.. ఆయ‌న ఉన్నార‌నేది వాస్త వ‌మేన‌ని ఇది కేవ‌లం బుద్దా వెంక‌న్న వ్యాఖ్య‌లే కావ‌ని.. తాము కూడా అలానే భావిస్తున్నామ‌ని అన్నారు. ఎన్టీఆర్ కుమార్తెను దుర్మార్గంగా వ్యాఖ్యానించిన త‌ర్వాత కూడా జూనియ‌ర్ సుతిమెత్త‌గా స్పందిస్తే.. ఎలా అని ప్ర‌శ్నించారు.

ఈ సంద‌ర్భంగా.. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆ ఇద్ద‌రు నేత‌లు(కొడాలి నాని, వంశీ)పై క‌త్తి తీసుకువెళ్లిపోవాలా? అంటే.. ఆయ‌న క‌త్తి తీసుకువెళ్తారో.. క‌ర్ర తీసుకువెళ్తారో.. చేత్తో కొడ‌తారో.. ఆయ‌న ఇష్టం. వెళ్ల‌డం అయితే.. వెళ్లాలి. అని బొండా ఉమా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అలాచేయడం జూనియ‌ర్ బాధ్య‌త‌ని.. అలా చేయ‌కుండా.. కేవ‌లం త‌మ‌ల‌పాకుతో స్పందించిన‌ట్టు స్పందిస్తే.. ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News