కో అంటే కొండ మీది కోతి సైతం ఎగరుకుంటే వచ్చే రోజులివీ.. డబ్బులుండాలే కానీ ఏదైనా జరిగిపోయే కాలం ఇదీ.. పైసామే పరమాత్మ లాగా వ్యవహారం తయారైంది.
కరోనా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. తనపర బేధం లేదు. పేద, ధనిక తేడా లేదు. అందుకే కొందరు బడాబాబులు ఈ కరోనా కల్లోలం నుంచి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ముందస్తుగా ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన పర్మనెంట్ ఐసీయూ సూట్ రూమ్ లను బుక్ చేసుకుంటున్నారు.
ఇటీవల కరోనా బారినపడ్డ టాలీవుడ్ బడా నిర్మాత ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో రోజుకు లక్షలు ఖర్చు చేసే ఖరీదైన ఐసీయూ రూమ్ ను తీసుకొని చికిత్స పొంది తేరుకున్నాడు.
అయితే ఆయన డిశ్చార్జ్ అయ్యాక కూడా దాన్ని అలాగే అట్టిపెట్టుకున్నాడట.. తన కుటుంబసభ్యులు, సన్నిహితులు కరోనా బారినపడితే వారికి అందులోనే చికిత్స అందించాలని.. ఆస్పత్రులన్నీ నిండి.. బెడ్స్ దొరకని ఈ పరిస్థితుల్లో ఖరీదైనా సరే ఆ సూట్ రూంను తన పేరిటే ఉంచుకొని రోజూ లక్షల బిల్లులు చెల్లిస్తున్నాడట..
ఈయనే గారే కాదు.. దేశవ్యాప్తంగా బడాబాబులు.. రాజకీయ నేతలు ఇప్పుడు తమ పేరిట కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒక ఐసీయూ రూమ్ ను పర్మనెంట్ గా ఉంచేసుకొని కరోనా నుంచి తమ వారు ఎవరైనా సరే సీరియస్ అయితే చికిత్స అందేలా లక్షలు ఖర్చు చేస్తున్నారు.
ఆస్పత్రులన్నీ నిండిపోయి బెడ్ దొరకని ఈ సమయంలో కోట్లకు పడగలెత్తిన వారు ఇలా ముందస్తుగా ఆస్పత్రుల్లో సూట్ లు బుక్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. సూట్ తమ చేతుల్లో ఉంటే సందర్భాన్ని బట్టి తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డా.. సొసైటీలోని పెద్ద వాళ్లు ఎవరైనా కరోనా బారిన పడ్డా అడిగితే ఇచ్చేందుకు ముందస్తుగా ఒక ఆస్పత్రిలో రూమ్ ని బుక్ చేసుకుంటున్నారని వార్తలు వెలువడుతున్నాయి.