బాబుకు బొత్స సూటి ప్ర‌శ్న‌లు...

Update: 2019-09-19 12:06 GMT
ఏపీ మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు చనిపోయాడ‌నే సానుభూతి లేకుండా కేవ‌లం రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు వెంప‌ర్లాడుతున్నాడ‌ని ఏపీ మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆరోపించారు. గురువారం సాయంత్రం బొత్స స‌త్య‌నారాయ‌ర‌ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సీబీఐని రాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసింది చంద్రబాబు కాదా ? అని ప్ర‌శ్నించారు. అస‌లు సీబీఐ వ‌ద్ద‌ని - రాష్ట్రంలోకి కాలు కూడా పెట్ట‌నివ్వ‌మ‌ని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కోడెల మృతిపై సిబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని డిమాండ్ చేస్తూ గ‌వ‌ర్న‌ర్‌ ను బిశ్వ‌భూష‌న్ ను క‌ల‌వ‌డం  విడ్డూరంగా ఉంద‌న్నారు.

ఐదేళ్ళుగా ఏపీలోని అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబు నాయుడుకే ద‌క్కుతుంద‌న్నారు. మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఓడిపోయిన త‌రువాత ఆయ‌న‌తో ఎన్నిసార్లు భేటి అయ్యారో చెప్పాల‌ని - ఆయ‌న‌కు ఎందుకు క‌లిసేందుకు ఎందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదో చెప్పాల‌ని బొత్స డిమాండ్ చేశారు. కోడెల గ‌త మూడు నెల‌లుగా చంద్రబాబును క‌లిసేందుకు ప్ర‌య‌త్నించినా ఎందుకు  అనుమ‌తి ఇవ్వ‌లేదని... బాబు త‌న‌ను ప‌క్క‌న పెట్టార‌న్న మ‌న‌స్థాపంతోనే కోడెల  బీజేపీ వైపు పోవాల‌ను కోవ‌డం వాస్తవం కాదా ? అని ప్ర‌శ్నించారు. అధికారంలో ఉన్న‌ప్పుడు గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ ప‌నికి మాలిన‌ద‌న్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు వెళ్ళ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

చంద్రబాబు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే టీడీపీ కార్య‌కర్త‌లు - నాయ‌కుల జోలికి వెళ్ళ‌వ‌ద్ద‌ని ఎస్పీల స‌మావేశంలో చెప్పింది వాస్త‌వం కాదా ? అని ప్ర‌శ్నించారు. చంద్రబాబు నాయుడు సీఎంగా అయిన మొద‌టి రోజునే చ‌ట్టాల‌ను తుంగ‌లో తొక్కార‌ని - చంద్ర‌బాబు చేసిన చ‌ట్టాల‌ను ఆయ‌నే గౌర‌వించ‌లేద‌ని బొత్స ఆరోపించారు. ఇప్పుడు బొత్స చేసిన ఆరోప‌ణ‌ల‌తో రాష్ట్రంలో టీడీపీ - వైసీపీ న‌డుమ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది.
 
Tags:    

Similar News