ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన అక్రమాలపై మంత్రి బొత్స సత్యనారాయణ గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం రాజధానిలో ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ కు పాల్పడిందని, దానికి సంబంధించిన వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపెడతామని చెబుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరీకి రాజధానిలో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో చెప్పిన బొత్స..తాజాగా మరో సంచలన విషయం బయటపెట్టారు.
రాజధాని భూముల్లో బాలకృష్ణ వియ్యంకుడికి వందలాది ఎకరాల భూమిని చంద్రబాబు కట్టబెట్టారని ఆరోపించారు. నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు అయిన రామారావుకు చంద్రబాబు నాయుడు 493 ఎకరాలు కట్టబెట్టినట్లు ఆరోపించారు. ఏపీఐఐసీ కింద ఎకరం లక్ష రూపాయలు చొప్పున భూమిని కారుచౌకగా రాజధానిగా అమరావతిని ప్రకటించక మునుపే కట్టబెట్టారని చెప్పుకొచ్చారు.
ఇక రాజధానిగా అమరావతిని ప్రకటించాక, ఆ భూములన్నీ సీఆర్డీఏ పరిధిలోకి వచ్చేలా చూశారని, 'ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా?' అని బొత్స ప్రశ్నించారు. అయితే ఆ భూములు జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వీబీసీ కంపెనీ పేరుతో భూములు ఏపీఐఐసీ క్రింద కట్టబెట్టారన్నారు. ఇది కేవలం ఒక్క ఉందంతం మాత్రమే అని, చాలావరకు తెలుగుదేశం నేతలంతా అలా ముందస్తుగా భూములు చౌక ధరలకు కొనుగోలు చేసిన తర్వాతే రాజధాని అక్కడ అనే ప్రకటన వచ్చిందని, ఇదంతా స్కామ్ కాదా అని బొత్స అన్నారు.
వియ్యంకుడు వియ్యంకుడికి భూములు కట్టబెట్టడంపై మాజీ సీఎం చంద్రబాబు, మాజీమంత్రి నారా లోకేశ్ ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. దీన్ని క్విడ్ ప్రోకో అంటారా లేకపోతే ఏమంటారో ప్రజలకు తెలియజెప్పాలని డిమాండ్ చేశారు.