మరి కొద్ది రోజుల్లో నవంబర్ ఫస్ట్ వస్తోంది. ఉమ్మడి ఏపీలో ఈ రోజుకు ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. 1956న నవంబర్ ఫస్ట్ న ఉమ్మడి ఏపీ అవతరణ జరిగింది. విడిపోయిన తరువాత జూన్ 2 తెలంగాణా వారికి ఫార్మేషన్ డే అయితే ఏపీకి చంద్రబాబు టైం లో ఆవిర్భావ రోజు అంటూ లేదు. జగన్ వచ్చాక నవంబర్ ఫస్ట్ నే డిక్లేర్ చేశారు. అంటే ఏపీకి సంబంధించి ఏపీకి ఎంతో విలువ గౌరవం ఆ రోజునకు ఉంది. యాధృచ్చికంగా అదే రోజున ఏపీకి రాజధాని అయిన అమరావతి రాజధాని భవిష్యత్తుకు సంబంధించి సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూ యూ లలిత్ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన ధర్మానసం అమరావతి రాజధాని విషయంలో సమగ్రమైన విచారణ జరపనుంది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ లో సుప్రీం కోర్టు తలుపు తట్టింది. హై కోర్టు ఈ మార్చిలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ని దాఖలు చేసింది.
ఈ సందర్భంగా కొన్ని కీలకమైన అంశాలను ప్రభుత్వం తన పిటిషన్ లో ప్రస్తావించింది. అదేంటి అంటే పాలనాపరమైన రాజధానిని ఎంచుకునే హక్కు ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. రాజధానిని నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి లేదని హై కోర్టు ఇచ్చిన తీర్పుని ఆ విధంగా సవాల్ చేసింది. అంతే కాదు, సమాఖ్య వ్యవస్థకు ఈ తీర్పు ఇబ్బందికరమని వెల్లడించింది.
ఇక తాము మూడు రాజధానుల చట్టాన్ని అసెంబ్లీలో రద్దు చేసుకున్నాక కూడా హై కోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వడాన్ని కూడా సుప్రీం లో ప్రభుత్వం సవాల్ చేస్తోంది. దీంతో ఈ రెండు విషయాల మీద సుప్రీం కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది విచారణ ఎలా జరగనుంది అన్నది ఆసక్తికరంగా ఉంది. అదే టైం లో అమరావతి పరిరక్షణ కమిటీ ఒక పిటిషన్ దాఖలు చేసింది. అలాగే కొందరు వ్యక్తులు కూడా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
పరిరక్షణ కమిటీ తన పిటిషన్ లో చట్టబద్ధంగా ఒక ప్రభుత్వంతో అమరావతి రైతులు కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాలదన్నే హక్కు ప్రభుత్వానికి లేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం సీయార్డీయే కూడా రైతులతో చట్టబద్ధంగా ఒప్పందం చేసుకున్నారు కాబట్టే రైతులు ధైర్యంగా భూములు ఇచ్చారని వారు పేర్కొన్నారు.
ఇపుడు ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ కొత్త విధానాన్ని అనుసరిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని అని పేర్కొంటోంది. దీంతో ఈ కేసు విచారణ మీద సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. అమరావతి భవిష్యత్తు ఏం జరుగుతుంది అన్నది కూడా ఈ విచారణ తరువాత తేలుతుంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.