గతంలో వయసు మళ్లిన తర్వాత ఏవైనా వ్యాధులు ఇచ్చేవి. ఇప్పుడు చిన్న వయసులోనే వ్యాధుల బారినపడుతున్నారు. ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, రాత్రిళ్లు కూడా పనిచేసే ఉద్యోగాలు చేయడం, జీవన శైలి మారడం, ఆహార అలవాట్లలో మార్పులు తదితర కారణాలతో చిన్న వయసులోనే ఇప్పుడు జబ్బులు వచ్చిపడుతున్నాయి.
ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ యువతను గుల్ల చేస్తోంది. ఒకప్పుడు 50 ఏళ్ల వయసు వారికే పరిమితమైన బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు 20 ఏళ్ల యువకుల్లో కూడా పొడసూపుతోంది. ఇటీవల కాలంలో బ్రెయిన్ స్ట్రోక్‌లతో ప్రభుత్వ, ప్రై వేటు ఆస్పత్రులకు వస్తున్నవారిలో 20 నుంచి 35 ఏళ్ల మధ్య కూడా ఉండటం ఆందోళన రేపుతోంది. ఇటీవల విజయవాడలో తొమ్మిదేళ్ల హెచ్‌ఐవీ బాధిత బాలుడు కూడా బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై ప్రభుత్వాస్పత్రిలో చేరడం గమనార్హం.
ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు ప్రధాన కారణాలు.. రక్త ప్రసరణలో అవరోధం కలగడం, నరాలు చిట్లడం. మెదడుకు ఆక్సిజన్, పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాలు చిట్లిపోవడం, రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడటం వల్ల మెదడులోని ఆ భాగం కణ మరణానికి దారి తీసి స్ట్రోక్‌కు గురవుతారు.
కాగా యువకులు స్ట్రోక్‌కు గురవడానికి ప్రధాన కారణం స్మోకింగ్, ఆల్కహాల్ అని వైద్యులు చెబుతున్నారు. అలాగే జీవన విధానంలో మార్పులు, మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉండటం, ఒబెసిటీ ఉండేవారిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
మహిళల్లో కంటే పురుషులకు స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ అని చెబుతున్నారు. అయితే ఈస్ట్రోజెన్ కలిగి ఉన్న హార్మోన్ థెరఫీలు, గర్భనిరోధక మాత్రలు వాడిన మహిళల్లో స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అంటున్నారు.
గుండె జబ్బులు ఉన్న వారికి బ్రెయిన్‌స్ట్రోక్ రావచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఏవైనా రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలైన వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని అంటున్నారు.
బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు
–కళ్లు తిరగడం
–తీవ్రమైన తలనొప్పి
–మాట్లాడటంలో ఇబ్బంది
–ముఖం వేలాడి పోవడం
–చేతులు బలహీనత
–జ్ఞాపకశక్తి కోల్పోవడం
– దృష్టిదోషం
ఈ లక్షణాలు గుర్తించిన నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకోగలిగితే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
యువకులు బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై పక్షవాతం బారిన పడటంతో వారి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమవుతున్నాయి. అందుకే స్ట్రోక్‌కు గురైన తర్వాత ప్రతి నిమిషం విలువైనదే అనే నినాదంతో ఈ ఏడాది వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా వైద్యులు దీనిపై అవగాహన పెంపొందిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.