మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఏపీలోని జగన్ సర్కార్. రాజధాని అమరావతిలో పరిధిలో సీఆర్డీఏ కొందరికి కేటాయించిన ఫ్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారికి ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్ డీఏ ప్లాట్లను కేటాయించారు. ఈ కేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ల్యాండ్ పూలింగ్ చట్టం 2015 కింద రాజధాని నిర్మాణానికి వీలుగా పెద్ద ఎత్తున భూముల్ని సమీకరించారు. అయితే.. గతంలో ఇదే ప్రాంతంలో పేదలకు.. దళితులకు మంజూరు చేసిన అసైన్డ్ భూముల్ని కొందరు రాజకీయ నేతలు నిబంధనలకు విరుద్ధంగా వారి నుంచి కొనుగోలు చేశారు.
అనంతరం సీఆర్డీడీఏ వద్ద తాము కొన్న భూముల్ని ఇచ్చేసి.. అందుకు బదులుగా వాణిజ్య.. నివాస స్థలాల్ని తీసుకున్నారు. అసైన్డ్ భూముల్ని కొనుగోలు చేయటం 1977 నాటి చట్టమైన ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్సఫర్ యాక్ట్ కింద చట్టవిరుద్ధం.
అలాంటి అసైన్డ్ భూములు ఇచ్చి అందుకు బదులుగా ఫ్లాట్లు కేటాయించిన విధానం నిబంధనలకు విరుద్ధంగా తేల్చారు. ల్యాండ్ పూలింగ్ కింద మెట్ట ప్రాంతంలో ఎకరా భూమి తీసుకుంటే 500 గజాల నివాసస్థలం.. 50 గజాల వాణిజ్య స్థలాన్ని ఇచ్చారు. అదే జరీబు భూములకైతే 500 గజాల నివాస స్థలం.. 100 గజాల వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే.. అసైన్డ్ భూములు కొని వాటిని ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చి.. అందుకు బదులుగా ఫ్లాట్లు తీసుకున్న వారి నుంచి వారికి కేటాయించిన వాటిని తిరిగి తీసుకునేందుకు వీలుగా ఏపీ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయం పలువురు పెద్దలకు షాకింగ్ గా మారుతుందని చెబుతున్నారు.