గోవా వాసుల్ని బ్రెగ్జిట్ అలా దెబ్బేసింది

Update: 2016-06-25 15:06 GMT
యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలన్న నిర్ణయాన్ని తీసుకున్న బ్రిటీషర్ల నిర్ణయం ప్రపంచానికి ఎంతలా దెబ్బసిందో అందరికి తెలిసిందే. ప్రపంచానికే కాదు.. తమను తాము కూడా దెబ్బేసుకున్నామన్న విషయాన్ని పలువురు బ్రిటీషర్లు ఇప్పుడు వాపోతున్న విషయం వార్తల రూపంలో రావటం చూస్తున్నదే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గోవా వాసుల గోడు మరోలా ఉంది. తాజాగా బ్రిగ్జిట్ వ్యవహారం వారిని తీవ్రంగా దెబ్బ తీసిందన్న వాదన వినిపిస్తోంది. మిగిలిన వారిని దెబ్బేసిన తీరుకు.. గోవా వాసుల మీద పడిన దెబ్బకు సంబంధం లేదని చెబుతున్నారు. ఇంతకీ గోవా వాసుల్ని అంతలా ఏం దెబ్బ పడిందన్న విషయాన్ని తెలుసుకోవాలంటే ముందు కాస్తంత చరిత్రలోకి వెళితే.. విషయం ఇట్టే అర్థమవుతుంది.

గోవాను 450 సంవత్సరాలు పాలించిన పోర్చుగీస్.. 1961లో దాన్ని భారత్ లో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. అయితే..1961కు ముందు పుట్టిన వారితో పాటు.. వారికి పుట్టిన పిల్లలు.. వారి పిల్లలను పోర్చుగీసు పౌరులుగా పోర్చుగీసు ప్రభుత్వం పరిగణిస్తోంది. ఈ కారణంగానే 1961 నుంచి ఇప్పటివరకూ దాదాపు నాలుగు లక్షల మంది గోవా వాసులకు పోర్చుగీసు ప్రభుత్వం పాస్ పోర్టులు జారీ చేసింది. ఇప్పటికి పాస్ పోర్టులు జారీ చేసింది.

ఈ పాస్ పోర్టులతో యూరోపియన్ దేశాల సమాఖ్యలో ఉన్న దేశాల్లో ఒకటైన పోర్చుగీసుతో పాటు.. సమాఖ్యలోని వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ కారణంతోనే బ్రిటన్ లో పాతికవేల మంది వరకూ ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. ఇక.. గోవా వాసులకు బ్రిటీషర్లు ఉద్యోగాలు ఇవ్వటానికి కారణం వారికి.. ఇంగ్లిషు బాగా రావటమే. ఇలా పోర్చుగీసు వీసాల మీద బ్రిటన్ కు వెళ్లి ఉద్యోగం చేసి.. అక్కడే స్థిరపడినోళ్లు ఉన్నారు.

తాజాగా చోటు చేసుకున్న పరిణామంతో అలాంటి అవకాశం ఉందన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో.. మొన్నటివరకూ గోవాలోని పోర్చుగీసు పాస్ పోర్ట్ కార్యాలయం కళకళలాడిన దానికి భిన్నంగా ఇప్పుడు బోసిపోయింది. బ్రిగ్జెట్ లో తీసుకున్న తాజా నిర్ణయంతో తాము బ్రిటన్ వెళ్లే అవకాశాన్ని కోల్పోయినట్లుగా భావిస్తున్నారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారు.. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలన్న నిర్ణయాన్ని తీసుకోవటంపై వారు బాధకు గురి అవుతున్నారు. ఈ లెక్కన బ్రెగ్జిట్.. ఇలాంటి ఎన్ని బాధల్ని రేపిందో..?
Tags:    

Similar News