ప్రఖ్యాత బ్రిటన్ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ లియోన్ ను భారత సంతతికి చెందిన కుబేర సోదరులు ‘మోసిన్, జుబేర్ ఇస్సాలు’ కొనుగోలు చేశారు. బ్రిటన్ లో తమ ఆహార సేవల కార్యకలాపాలను పెంచుకునే లక్ష్యంలో భాగంగా ఈ ట్రాన్షాక్షన్ ను చేపట్టినట్లు సోదరులు తెలిపారు.
ఈ భారీ డీల్ విలువ దాదాపు రూ.1040 కోట్లుగా ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.. 1970లో గుజరాత్ నుంచి ఈ సోదరుల తల్లిదండ్రులు బ్రిటన్ కు వలస వెళ్లారు. వీరికి ఈజీ గ్రూప్ వ్యాపారుల కింద యూరో గ్యారేజెస్ పేరిట పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఇంధనయేతర రంగంలోకి వీరు తమ వ్యాపారాన్ని విస్తరించారు.
గత ఏడాది బ్రిటన్ సూపర్ మార్కెట్ సంస్థ అస్డాను సైతం వాల్ మార్క్ నుంచి వీరిద్దరూ కొనుగోలు చేశారు. 2004లో లియోన్ ను స్థాపించారు. నేచురల్ ఫాస్ట్ ఫుడ్ కేటగిరిలో దీనిని ప్రారంభించారు. బ్రిటన్ వ్యాప్తంగా పేరు పొందిన ఈ సంస్థను ఇప్పుడు భారతీయ కుబేరుల చేతికి చిక్కింది.