ఆశకు మితం ఉండాలి. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుందన్న విషయం తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే పాక్ కు అర్థమైపోవాలి. తాను ఆక్రమించుకున్న కశ్మీర్ తో పాటు.. మిగిలిన కశ్మీర్ మీద కన్నేసి.. దశాబ్దాల తరబడి దాయాది దేశం ఆడుతున్న దుర్మార్గపు ఆట ముగిసే సమయం దగ్గర పడిందా? అన్న ప్రశ్న మదిలో మెదిలేలా తాజాగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇంతకాలం భారత్ సహనాన్ని చేతకానితనంగా భావిస్తున్న పాకిస్తాన్ కు.. ప్రధాని మోడీ పుణ్యమా అని షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మోడీకి ముందున్న ప్రభుత్వాలేవీ కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ మీద పెద్దగా మాట్లాడింది లేదు. అందుకు భిన్నంగా మోడీ సర్కారు మాత్రం.. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్ అంతర్భాగమేనని తేల్చి చెప్పటమే కాదు.. దాన్ని సొంతం చేసుకోవటం తమ ధ్యేయమంటూ వ్యాఖ్యలు చేయటాన్ని మర్చిపోకూడదు.
ఇలాంటివేళ.. జమ్ముకశ్మీర్ మీద ఒక బ్రిటీష్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ కు పూర్తి మద్దతు ఇవ్వటమే కాదు.. పాక్ ను పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్) నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్ భారత అంతర్భాగమని సదరు బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్ మన్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అమలు చేయాలని కోరే వారు ముందు.. కశ్మీర్ రాష్ట్రాన్ని ఏకీకృతం చేసేందుకు వీలుగా కశ్మీర్ నుంచి పాక్ సైన్యాన్ని వైదొలగాలన్న తొలి తీర్మానాన్ని మర్చిపోవటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.
కశ్మీర్ నుంచి పాక్ సైన్యం వైదొలగాలన్న తొలి తీర్మానాన్ని పాక్ మర్చిపోకూడదన్న ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. జమ్ముకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రస్తావిస్తామని.. ఆర్టికల్ 370 నిర్వీర్యాన్ని సవాలు చేస్తామంటూ పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బ్రిటిష్ ఎంపీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇప్పటివరకూ పాక్ ఆక్రమిత కశ్మీర్ మీద అటూ ఇటూ కాని రీతిలో వ్యాఖ్యలు చేసే దేశాలకు భిన్నంగా.. పీవోకే భారత్ లో అంతర్భాగమని.. దాన్ని పాక్ ఖాళీ చేయాలన్న వాదన తెర మీదకు రావటం దాయాదికి మింగుడుపడని వ్యవహారంగా మారుతుందనటంలో సందేహం లేదు.