అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ గెలుపు లండన్ మహానగర ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుందట. ఎక్కడ అమెరికా? ఎక్కడ బ్రిటన్? ట్రంప్ కి.. లండన్ కు లింకేమిటి? అయినా.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైతే.. లండన్ వాసులకు ఎందుకంత గుబులు? లాంటి ప్రశ్నలు వేసుకొని.. వాటికి సమాధానాలు వెతికితే.. ఆసక్తికర సమాచారం వస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి.. బ్రిటీషర్లు కంటి నిండా కునుకు తీయలేకపోతున్న ఆసక్తికర విషయం.. తాజాగా విడుదలైన ఒక సర్వే నివేదికలో వెల్లడైంది.
ఎందుకలా అంటే.. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావటంతో.. నియంతృత్వ పోకడలు పెరిగినట్లుగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ధోరణి పెరిగిపోతున్నట్లుగా లండన్ వాసులు భావిస్తున్నారట. ది ఇండిపెండెంట్ పత్రిక కోసం నిర్వహించిన పరిశోధనలో ఇది బయటకు వచ్చింది. ఈ కారణంగా వారు సరిగా నిద్ర పోలేకపోతున్నట్లుగా వెల్లడైంది.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అమెరికాతో పాటు..ప్రపంచ వ్యాప్తంగా ఫాసిజం పెరిగిపోతోందని బ్రిటన్ వాసుల్లో అత్యధికులు భయపడిపోతున్నట్లు తేలింది. బ్రిటన్ పౌరుల్లో 53 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం మూడు శాతం మంది మాత్రమే ఫాసిజం తగ్గుతుందని చెప్పగా.. ఫాసిజం యథాతథ స్థితిలో ఉన్నట్లుగా 20 శాతం మంది చెప్పటంగమనార్హం.
లండన్ వాసులే కాదు.. యూరప్ వాసులు సైతం.. ఫాసిజం ఆలోచనలు పెరుగుతున్నట్లుగా 48శాతం మంది అభిప్రాయపడుతున్నట్లుగా తేలింది. మొత్తానికి ట్రంప్ గెలుపు అమెరికాను మాత్రమే కాదు ప్రపంచం మొత్తం మీదా ప్రభావితం చూపిందనే చెప్పాలి. అందుకే.. అమెరికాను పెద్దన్న అని అందుకేనేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/