సింగపూర్లో ఒక ప్రవాసీ భారతీయ కుటుంబం చేసిన దారుణమైన నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. తమ ఇంటి పని మనిషిని పైశాచికంగా హింసించడంతో పాటు ఆమె మరణానికి కారణమైనట్లు తాజాగా రుజువైంది. ఈ కేసు దర్యాప్తులో పలు సంచలన విషయాలు బయటికి రావడంతో అంతా విస్మయానికి గురవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రేమ.. నారాయణ స్వామి అనే భారతీయ దంపతులు సింగపూర్లో నివాసం ఉంటున్నారు. వీరికి గాయత్రి అనే పెళ్లయిన కూతురు ఉంది. గాయత్రి మాజీ భర్త పేరు కెవిన్ చెల్వం. కాగా ఈ కుటుంబం తమ ఇంటి అవసరాల కోసం సింగపూర్ కు చెందిన 24 ఏళ్ళ పియాంగ్ నెహ్ డాన్ అనే మహిళను పనిలో పెట్టుకున్నారు. ఇక వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ పని మనిషి మాత్రం క్రూరంగా హింసంచబడి మరణించింది.
షియాంగ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సింగపూర్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేపట్టగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పియాంగ్ ను ప్రేమ.. గాయత్రి అనే మహిళలు తీవ్రంగా హింసించినట్లు నిర్ధారణ అయింది. పని మనిషి చేతులను వెదురు కర్రలతో కొట్టడం.. సీసాలతో కొట్టడం.. ఆమె జుట్టు పట్టుకుని పైకి లాగడం.. రాత్రి సమయంలో ఆ మహిళను కిటికీ గ్రిల్స్‌కు కట్టేయడం వంటివన్నీ కూడా ఆ ఇంటి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
షియాంగ్ కు సరైన ఆహారం కూడా అందించకపోవడం.. శారీరకంగా హింసించడం వంటి కారణాలతో చివరకు మృతి చెందింది. ఆమె చనిపోయే సమయంలో మెడ వెనుక భాగంలో.. మెదడుకు బలమైన గాయాలైనట్లు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో నెలల తరబడి షియాంగ్ ను భారతీయ మహిళలు హింసించడంతో డాన్ పూర్తిగా బరువు కోల్పోయారు. ఆహారం తినకపోవడంతో ఆమె చనిపోయే సమయంలో 24 కిలోలకు చేరిదంటే ఆమె ఎంతలా హింసించారో అర్థం చేసుకోవచ్చు.
పోలీసులు విచారణలో పలు సంచలన విషయాలు బయటికి రావడంతో ప్రేమ.. గాయత్రి.. కెల్విన్ చెల్వంలను అరెస్టు చేసి సింగపూర్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ప్రేమ 48 నేరాలను అంగీకరించగా.. గాయత్రి 28 నేరాలు చేసినట్లు అంగీకరించడంతో కోర్టు వారికి శిక్షను ఖరారు చేసింది. పియాంగ్ ను ఉద్దేశ్యపూర్వకంగా హింసించిన కేసులో ఒక్కో నేరానికి రెండేళ్ల జైలు శిక్ష మరియు 5వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.
అలాగే గాయత్రికి 30 ఏళ్ళ జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. ఏది ఏమైనా ఒక భారతీయ కుటుంబం ఒక సింగపూర్ మహిళను క్రూరంగా హింసించి చంపడం అందరనీ విస్మయానికి గురి చేస్తోంది. ఇలాంటి వాళ్లు కూడా మన మధ్యలో ఉన్నారా? అన్న భావనే ఒళ్ళు గగుర్పాటు గురయ్యేలా చేస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.