ఏపీకి ప్రత్యేకహోదా అంశం టీడీపీ.. బీజేపీ మిత్రత్వం మీద ప్రభావం చూపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంగా ఉండటం తెలిసిందే. కేంద్రంలో తమ మిత్రపక్షమే అధికారంలో ఉన్నప్పటికీ.. కించిత్ సాయం అందకపోగా.. తమను ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు తీసుకోవటంపై వారు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అధినేత అనుసరిస్తున్న సంయమన వైఖరితో ఆచితూచి వ్యవహరించిన తెలుగుదేశం నేతలు.. తాజాగా తమ నిరసనను వ్యాఖ్యల రూపంలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
ఏపీకి ప్రత్యేక హోదా విషయం మీద కేంద్ర సహాయ మంత్రి ఇటీవల వ్యాఖ్యలు చేయటం.. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పటంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అధినేత అసంతృప్తి చేయటంతో.. అందుకు తగ్గట్లు తమ స్థాయిలో తాము కాస్తంత స్వేచ్ఛ తీసుకొని మాట్లాడేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విజయవాడ ఎమ్మెల్యే.. జగన్ పార్టీ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన జలీల్ ఖాన్ చెలరేగిపోవటం మర్చిపోకూడదు.
ఆయనకు మించి అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీజేపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం గమనార్హం. బుచ్చయ్య చౌదరి మాటలు చూస్తే.. ఇప్పటివరకూ ఏ తెలుగుదేశం నేత ఈస్థాయిలో బీజేపీ మీద విమర్శలు చేయలేదని చెప్పాలి. తెలుగువాడి ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరిక చేసిన బచ్చయ్య.. గతంలో ఇందిరాగాంధీకి.. సోనియాగాంధీకి పట్టిన గతే మరో నాయకుడికి పడుతుందన్న తీవ్ర వ్యాఖ్య చేశారు.
ఇందిరా.. సోనియాలకు పట్టిన గతే మరో నాయకుడు అన్న మాటను ఉపయోగించారే కానీ.. అదెవరన్నది బుచ్చయ్య చెప్పకున్నా అందరికి అర్థమయ్యేదే. మిత్రపక్షంలో కీలక నేతపై ఈ తరహాలో వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తమ హక్కుల సాధన కోసం కేంద్రం మీద పోరాటం చేయటం బాగానే ఉంటుంది కానీ.. తొందరపాటుతో మాట తూలితే మరింత నష్టం అన్న విషయాన్ని తమ్ముళ్లు గుర్తిస్తే మంచిదేమో..?