కొత్త ఏడాది వచ్చిందంటే చాలు.. సరికొత్త అంచనాలు.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కసరత్తు లాంటివి తెలిసిందే. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. కేంద్ర బడ్జెట్ కసరత్తు.. తుది దశలో ప్రింటింగ్ చేసే వేళలో బడ్జెట్ హల్వాను కేంద్ర ఆర్థిక మంత్రి స్వయంగా వండటం.. దాన్ని ఆర్థిక శాఖ ఉద్యోగులకు పంచటం చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఈసారికి బడ్జెట్ హల్వాను వండటం లేదు. కవిడ్ కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సంప్రదాయాన్ని పాటించే క్రమంలో హల్వాకు బదులుగా బయట నుంచి స్వీట్లను కొని ఉద్యోగులకు పంచనున్నారు.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను అత్యంత రహస్యంగా ఉండటం.. బడ్జెట్ తుది కసరత్తు మొదలైన వెంటనే నార్త్ బ్లాక్ లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద మీడియాను.. మీడియా ప్రతినిధులను కూడా అనుమతించరు. ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలోని బేస్ మెంట్ లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ లో బడ్జెట్ పత్రాల్ని ప్రింట్ చేయించటం తెలిసిందే. ఇక్కడ పని చేసే ఉద్యోగులు బయటకు వెళ్లకుండా.. అక్కడే ఉండిపోతారు. బడ్జెట్ రోజునే బయటకు వస్తారు. ఎప్పటిలా కాకుండా ఈసారి చాలా పరిమిత సంఖ్యలో బడ్జెట్ పత్రాల్ని ముద్రించనున్నారు. పేపర్ రహితంగా బడ్జెట్ ను సిద్ధం చేస్తున్నారు.
ఈ కారణంగా ఈసారి హల్వా వేడుకను నిర్వహించటం లేదు. అయితే.. బడ్జెట్ ను సిద్ధం చేసిన సిబ్బంది లాక్ ఇన్ లో ఉండటం.. బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ పూర్తైన తుది రోజున స్వీట్లు పంచుతారు. బడ్జెట్ కసరత్తు మొదలైన వెంటనే.. ఆర్థిక శాఖ సిబ్బంది లాక్ ఇన్ లోకి వెళ్లిపోవటం.. పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశ పెట్టే వరకు వారికి ఆర్థిక శాఖ కార్యాలయంలో వసతులు కల్పిస్తారు. కనీసం కుటుంబ సభ్యులతోనూ ఫోన్ లో మాట్లాడుకునే వీలు ఉండదు.
అత్యవసరమైతే భద్రతా సిబ్బంది సమక్షంలో ఫోన్ చేసుకునే అవకాశం ఇస్తారు. పార్లమెంటులో కేంద్రమంత్రి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత సిబ్బంది క్వారంటైన్ నుంచి బయటకు వస్తారు. కేంద్రంలో మోడీ సర్కారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నుంచి అప్పటివరకు ఆర్థిక మంత్రులు అనుసరించే పద్దతిని మార్చారు. గతంలో బడ్జెట్ కాపీలను లెదర్ సూట్ కేసులో తీసుకొచ్చేవారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి పద్దుల సంచీతో దర్శనమిస్తున్నారు. బడ్జెట్ ను డిజిటల్ రూపంలోకి మార్చటం తెలిసిందే. గత ఏడాది ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను రూపొందించారు. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసి బడ్జెట్ పత్రాల్ని చూసేలా జాగ్రత్తలు తీసుకున్నారు.