మార్పు అన్నది మొదలు కాకూడదు. ఒకసారి మొదలైతే దానికి అంతం ఉండదు. మిగిలిన రంగాలతో పోలిస్తే.. రాజకీయాల్లో ఒక మార్పు మొదలైతే.. దానికి సంబంధించిన పరిణామాల్ని చకచకా జరిగిపోతుంటాయి. దీనికి మీడియా ఒక చేయి వేస్తుందన్నది తెలిసిందే. గడిచిన కొద్దిరోజలుగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత పలువురు టీడీపీ నేతలు పార్టీ మారిన సంగతి తెలిసిందే.
మిగిలిన నేతల్లో జగన్ సర్కారుపై ఒంటికాలిపై విరుచుకుపడే అతి కొద్ది మంది తెలుగు తమ్ముళ్లలో గోరంట్ల ఒకరు. టీడీపీకి అరవీర భయంకర కమిట్ మెంట్ ఉన్న నేతగా పేరుంది. అలాంటి నేత కానీ పార్టీ మారినపక్షంలో టీడీపీకి తగిలే దెబ్బ అంతా ఇంతా కాదు. బుచ్చయ్య చౌదరి పార్టీ మారే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. టీడీపీ శ్రేణులు తీవ్రమైన అయోమయానికి గురవుతున్నాయి.
మొదట్లో బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేస్తామని చెబితే.. నమ్మని వారు సైతం ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ వాదనకు బలాన్ని చేకూర్చేలా మారాయి. దీంతో.. బుచ్చయ్య పార్టీ మారే విషయంలోనూ పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా సందేహం కలిగిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. తాజాగా గోరంట్లకు బాబు స్వయంగా ఫోన్ చేయటం తాజా పరిణామంగా చెప్పాలి. బయట జరుగుతున్న ప్రచారంపై బుచ్చయ్య చౌదరిని అడిగినట్లుగా చెబుతున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు చెప్పాలని బాబు కోరినట్లుగా చెబుతున్నారు.
ఇంతకీ బుచ్చయ్య చౌదరికి సంబంధించి ఇలాంటి ప్రచారం సాగుతుందన్నది చూస్తే.. స్థానిక నాయకత్వం మీద కొద్ది రోజులుగా ఉన్న గుర్రుకు అనుబంధ కమిటీల ఏర్పాటు మరింత ఆజ్యం పోసిందని చెబుతున్నారు. ఇంతకీ బుచ్చయ్య చౌదరి కోపం పాల పొంగా? లేదంటే ఆయన పట్టుదలతో ఉన్నారా? ఇంకేమైనా ప్లాన్ ఉందా? అన్న ప్రశ్నలు వెంటాడుతున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామం కొత్త సందేహాలకు తావిస్తోంది.
ఇటీవల జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివరణ కోరేందుకు ఈ రోజు (గురువారం) మీడియా ఆయన ఇంటికి వెళ్లింది. పార్టీకి రాజీనామా చేస్తున్నారా? అని అడిగితే.. అందుకు సమాధానం చెప్పకుండా.. ఇప్పుడేమీ మాట్లాడనని చెప్పటం ఆసక్తికరంగా మారింది. పార్టీ గ్రాఫ్ అంతకంతకూ తగ్గుతుందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. తన సంగతి తాను చూసుకోవాలన్న ఆలోచనలో బుచ్చయ్య ఉన్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటికే జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరేలా బుచ్చయ్య తీరు ఉందని చెప్పక తప్పుదు. మరి.. ఈ ఇష్యూను చంద్రబాబు ఎలా డీల్ చేస్తారో చూడాలి.