కొన్ని నెలల కిందట కర్నూలు జిల్లాకు వెళ్లి అక్కడ కార్యకర్తల్లో ఉత్సాహం తెప్పించేందుకు చంద్రబాబు నాయుడి తనయుడు లోకేష్ బాబు ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో భాగంగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు మీడియాకు ఆసక్తిదాయకంగా నిలిచాయి. తెలుగుదేశం పార్టీలో మాత్రం అవి దుమారం రేపాయి. కర్నూలు ఎంపీ సీటు నుంచి బుట్టా రేణుకను మళ్లీ గెలిపించాలని - కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని గెలిపించాలని లోకేష్ అప్పుడు పిలుపునిచ్చారు!
ఆ మాటలు అప్పట్లో పెను దుమారం రేపాయి. అయితే ఆ మాటలు అప్పుడు అటు ఎస్వీ మోహన్ రెడ్డికి - ఇటు బుట్టా రేణుకకు చాలా ఊరటను ఇచ్చాయి. ఆ విషయంలో వారు లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు బుట్టా రేణుక! ఇదీ పరిస్థితి.
కొన్ని నెలల కిందటే లోకేష్ ఈమెకు టికెట్ ఖరారు చేశారని అనుకుంటే.. ఇప్పుడు ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. బుట్టా రేణుక గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి నెగ్గారు. తర్వాత ఫిరాయించారు. తెలుగుదేశం నేతగా చలామణి అయిపోయారు. లోకేష్ బాబు ఆశీస్సులున్నాయని - ఆమెకు టికెట్ ఖరారు అని అంతా అనుకున్నారు.
అయితే లోకేష్ బాబు ప్రసంగాల్లో పస లేనట్టుగా.. ఆఖరికి ఆయన టికెట్ ఖరారు చేసినా..ఆమెనే మళ్లీ గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నేతలకు పిలుపునిచ్చినా.. చివరకు ఆమెకు టికెట్ మాత్రం దక్క లేదు. లోకేష్ ఆమెకు టికెట్ ఖరారు చేశారని అనుకుంటే.. ఆమె ఇప్పుడు మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాల్సిన పరిస్థితి వచ్చింది.
మరి లోకేష్ చేత టికెట్ హామీ పొందిన రేణుక పరిస్థితి ఇది. ఇక అదే సమయంలో లోకేష్ చేత టికెట్ ఖరారు అనిపించుకున్న ఎస్వీ మోహన్ రెడ్డి పరిస్థితి ఏమవుతుందో.. మరి కొన్ని గంటల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి!