జగన్ 'బుట్ట' లో పడడం కష్టమే.?

Update: 2019-12-17 11:27 GMT
రాజకీయాల్లో తప్పటడుగులు వేస్తే ఎంత నష్టమో బుట్ట రేణుకను చూస్తే అర్థమవుతుంది. 2014లో వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి కర్నూలు  వైసీపీ ఎంపీగా గెలిచారు. అనంతరం చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు గురై గత ప్రభుత్వంలో టీడీపీలో చేరారు. ఆయన 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించి మళ్లీ వైసీపీ బాట పట్టారు.

ఇప్పుడు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు తనకు ఇస్తారని గంపెడాశలు పెట్టుకుంటున్నారట.. వైవీ సుబ్బారెడ్డిని కలిసి లాబీయింగ్ చేస్తున్నారట..

కానీ నమ్మినోళ్లకు మొదట అవకాశం ఇచ్చే జగన్ ‘బుట్ట’లో పడుతారనుకుంటే పొరపాటే అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఆది నుంచి పార్టీలో తనతోపాటు ఉన్నవారికే జగన్ పదవులు ఇస్తుంటారు. ఫృథ్వీ, విజయ్ చందర్ లకు అందుకే గౌరవమిచ్చారు. ఇప్పుడు రాజకీయాల్లో నిలకడ లేని బుట్టా రేణుకకు జగన్ పదవి ఇస్తారనే ఆశలు అడియాశలే అంటున్నారు వైసీపీ శ్రేణులు.

జగన్ ను మోసం పార్టీ మారి తిరిగి వచ్చిన ఆమెకు పదవి కష్టమేనని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కానీ బుట్టా మాత్రం తనకు ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవి గ్యారెంటీ అంటున్నారట.. మరి జగన్ ఏం చేస్తారన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News