బైరెడ్డి కొత్త డిమాండ్‌.. సాధ్య‌మేనా? పొలిటిక‌ల్ డిబేట్‌

Update: 2022-02-04 09:30 GMT
రాయ‌ల‌సీమ‌కు చెందిన సీనియర్ నాయ‌కుడు.. పొలిటిక‌ల్ మిర్చి.. బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. గురించి ప్ర‌త్యే కంగా ప‌రిచ‌యం చేయాల్స‌ని అవ‌స‌రం లేదు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌త్యేకంగా.. రాయ‌ల‌సీమ రా ష్ట్రం కావాలంటూ.. ఉద్య‌మం చేప‌ట్టారు. ప్ర‌త్యేక రాయ‌ల సీమ ఉద్యమం పేరుతో ఒక పార్టీని కూడా పెట్టా రు. రాయ‌ల‌సీమ‌ను ప్ర‌త్యేకంగా రాష్ట్రం ఏర్పాటు చేయాల‌ని.. లేక‌పోతే.. తెలంగాణ‌లో అయినా క‌లిపేయా ల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలోనే కిర‌ణ్‌కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంలో ఆయ‌న అరెస్ట‌యి.. జైలు కు కూడా వెళ్లారు.

అయితే... ఆ త‌ర్వాత ఈ ఉద్య‌మం ఎటు పోయిందో తెలియ‌దు. ఇక‌, ఇప్పుడు .. మ‌రో డిమాండ్‌తో బైరెడ్డి తెర‌మీద‌కి వ‌చ్చారు. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న జిల్లాల ఏర్పాటు అంశంపై మ‌రో వివాదం రేపారు. సీమ జిల్లాల‌ను 14 జిల్లాలు చేయాల‌ని బైరెడ్డి కోరుతున్నారు. ప్ర‌స్తుతం సీమ‌ల నాలుగు జిల్లాలు ఉన్నాయి. చిత్తూరు, అనంత‌పురం, క‌ర్నూలు, క‌డ‌ప‌. ఇవి విస్తీర్ణం రీత్యా,... కేర‌ళ రాష్ట్రానికి స‌రిస‌మానంగా ఉన్నాయ‌ని.. అందుకే వీటిని ప్ర‌త్యేకంగా 14 జిల్లాలుగా విడ‌దీయాల‌ని కోరుతున్నారు. ప్రస్తుతం బీజేపీలో రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ గా ఉన్న బైరెడ్డి ఇటీవల ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలను నాలుగు చొప్పున‌, కడప, చిత్తూరు జిల్లాలను మూడేసి  జిల్లాలుగా విభజించాలన్నారు. రాయలసీమలోని డోన్, ఆదోని, మదనపల్లె, హిందూపురం తో పాటు మరికొన్ని ముఖ్యమైన పట్టణాలను జిల్లాలుగా చేస్తే ప్రజలకు అన్ని విధాలా బాగుంటుందని బైరెడ్డి చెప్పారు. నాడు ఎన్టీఆర్ మండలాలను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన చేశారని, కానీ నేడు సిఎం జగన్ దూరంగా ఉన్న మండలాలను దగ్గర జిల్లాలో దగ్గరగా ఉన్న మండలాలను దూరంగా ఉండే జిల్లాలో కలిపి ప్రజలకు దూరపు పాలన అందిస్తున్నారని బైరెడ్డి వ్యాఖ్యానించారు..

రాయలసీమలో జగన్ 14 జిల్లాల ఏర్పాటు చేయాలని.. లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సీమలో జిల్లాల డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి. బైరెడ్డి వాదనతో ఎవ‌రైనా ఏకీభ‌వించి బ‌య‌ట‌కు వ‌స్తే.. ఈ ఉద్య‌మం పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News