యూపీని ఫాలో అవుతాం అంటున్న కర్ణాటక ఎంపీ ..ఎందులో అంటే !

Update: 2019-12-27 09:33 GMT
ప్రభుత్వం ఏదైనా ఒక కొత్త నిర్ణయం తీసుకుంటే .. దానికి వ్యతిరేక వర్గం వారు ..ఆ నిర్ణయానికి వ్యతిరేకం గా పోరాటం చేయడం ఎప్పటినుండో వస్తుంది. కానీ , ఆందోళనలల్లో ప్రభుత్వ ఆస్తులు భారీగా నాశనం అవుతున్నాయి. ఆందోళన చేస్తున్నవారు అదే పనిగా ప్రభుత్వ ఆస్తులనే టార్గెట్ చేసి ..ఆ ఆస్తులనే ధ్వంసం చేస్తుంటారు. ఇక పోతే దేశంలో కొద్దీ రోజుల గా కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం పై ఆందోళనలు జరగుతున్న విషయం తెలిసిందే.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకం గా ఉత్తరప్రదేశ్ లో ఆందోళన కారులు జరిపిన అల్లర్ల లో అక్కడి ప్రభుత్వ ఆస్తులు చాలా నాశనం అయ్యాయి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని అక్కడి ప్రభుత్వం సిసి కెమెరాల ద్వారా గుర్తించింది. దీనితో ప్రభుత్వ ఆస్తులని నాశనం చేసిన వారి ఆస్తులని స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని పూడ్చటానికి ప్రయత్నం చేస్తుంది. దీనిపై కర్ణాటక మంత్రి ఆర్. అశోక్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరైన పని చేసిందని అన్నారు.

అయితే , ఈ పౌరసత్వ సవరణ చట్టం(CAA)కు వ్యతిరేకం గా కర్ణాటక లో కూడా నిరసనలు రోజు రోజు కి పెరిగి పోతున్నాయి. అలాగే ప్రభుత్వ ఆస్తులని కూడా నాశనం చేస్తున్నారు. దీనితో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలా వారి ఆస్తులు రికవరీ చేస్తున్నదో అలాగే కర్ణాటక లో ఆందోళనకారుల నుంచి వారి ఆస్తులను రికవరీ చేస్తామని ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్ అన్నారు. నిరసనలు వ్యక్తం చేసే సమయంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వారిని చట్ట పరంగా శిక్షిస్తామని, అలా చెయ్యాలని మీకు ఎవరు చెప్పారని రెవెన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్ ఆందోళనకారులను ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను పక్కా ప్లాన్ తో ధ్వంసం చేసిన వారిని వదిలిపెడితో ప్రజలు మమ్మల్ని క్షమించరని మంత్రి ఆర్. అశోక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన వారిని గుర్తించి వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి కర్ణాటక లో కొత్త చట్టం అమలు చెయ్యాలని హోం మంత్రి కి తాము మనవి చేస్తామని అన్నారు. మంత్రి ఆర్. అశోక్ చేసిన ప్రతిపాదనకు మరో సీనిమర్ మంత్రి సీటీ. రవి మద్దతు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసిన వారిని గుర్తించి వారి నుంచి నగదు వసూలు చేస్తామని, మొండికేస్తే ముక్కు పిండి వసూలు చేస్తామని మంత్రి సీటీ. రవి అన్నారు. ఇకపోతే ఉత్తరప్రదేశ్ లో, కర్ణాటక లో బీజేపీనే అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.


Tags:    

Similar News