సినిమా ఏదైనా సెన్సార్ బోర్డులు ఇచ్చే కేటగిరిల్లో ''ఎ'' అంటూ పెద్దలు మాత్రమే చూసే సినిమాలు. 18 ఏళ్ల లోపు పిల్లలకు ఈ సినిమా టిక్కెట్లు అమ్మటం నేరం. ఇక ''యు/ఎ'' సర్టిఫికేట్ ఉన్న సినిమాల విషయానికి వచ్చే.. పెద్దల పర్యవేక్షణలో చూసే వీలుంటుంది. దీన్లో 18 ఏళ్ల లోపు పిల్లలకు నేరుగా టిక్కెట్లు ఇవ్వకూడదు కానీ.. పెద్దల సమక్షంలో మాత్రం చూసే వెసులుబాటు ఉంది. ఇక.. ''యు'' సర్టిఫికేట్ల సినిమాలు. ఈ సినిమాల్ని పిల్లలు నిరభ్యంతరంగా చూడొచ్చు.
కలెక్షన్ల కోసం.. నిబంధనల గిరి నుంచి తప్పించుకునేందుకు కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు ఇచ్చిన అనుమతులపై కాగ్ మండిపడింది. సెన్సార్ సర్టిఫికేట్ల జారీ విషయంలో నిబంధనల్ని పట్టించుకోకుండా వ్యవహరించారని ఆక్షేపించింది.
తాజాగా సమాచార హక్కు చట్టం ఆధారంగా 2013 అక్టోబరు నుంచి 2015 మార్చి వరకు విడుదల అయిన సినిమాలకు సంబంధించిన జారీ చేసిన సెన్సార్ సర్టిఫికేట్ల విషయంపై కాగ్ అభ్యంతరాలపై కోరిన ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి.
దీని ప్రకారం 2013 అక్టోబరు నుంచి 2015 మార్చి మధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో ''ఎ'' సర్టిఫికేటు ఇవ్వాల్సిన 172 సినిమాలను సింఫుల్‌గా ''యు/ఎ'' సర్టిఫికేటు ఇచ్చేసినట్లు తేల్చారు. అంతేకాదు.. ''యు/ఎ'' సర్టిఫికేటు ఇవ్వాల్సిన 166 సినిమాలకు ''యు'' కేటగిరి సర్టిఫికేట్లు ఇచ్చేసినట్లుగా గుర్తించి.. సెన్సార్ సర్టిఫికేట్ల జారీలో అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు. నిత్యం నీతులు చెప్పే సినీపెద్దలు దీనికి ఏం సమాధానం ఇస్తారో..?