కాలిఫోర్నియా ఫుడ్ ఫెస్టివ‌ల్ లో ఫైరింగ్..ముగ్గురు మృతి!

Update: 2019-07-29 05:58 GMT
పెద్ద‌న్న రాజ్యంలో తుపాకులు మ‌రోసారి చెల‌రేగిపోయాయి. తుపాకుల సంస్కృతి ఎక్కువ‌గా ఉండే అగ్ర‌రాజ్యం.. ఆ కార‌ణంగా ఇప్ప‌టికే ఎన్నో చేదు ఉదంతాల్ని ఎదుర్కొంది. తాజాగా అమెరికాలోని అతి పెద్ద‌దైన ఫుడ్ ఫెస్టివ‌ల్ గా చెప్పే గార్లిక్ ఫుడ్ ఫెస్టివ‌ల్ లో కాల్పుల క‌ల‌క‌లం చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని గిల్ రాయ్ లో జ‌రుగుతున్న ఈ భారీ ఫుడ్ ఫెస్టివ‌ల్ లో చోటు చేసుకున్న కాల్పుల కార‌ణంగా ముగ్గురు మ‌ర‌ణించ‌గా.. 16 మందికి పైనే గాయ‌ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు.

 కాలిఫోర్నియాలోని గిల్ రాయ్ లో మూడు రోజుల పాటు జ‌రిగే ఫుడ్ ఫెస్టివ‌ల్ లో.. చివ‌రి రోజైన ఫెస్టివ‌ల్ కు భారీ సంఖ్య‌లో అతిధులు హాజ‌ర‌య్యారు. హుషారుగా సాగుతున్న ఫుడ్ ఫెస్టివ‌ల్ లోకి 30 ఏళ్ల శ్వేత జాతీయుడు ఒక‌రు దూసుకొచ్చి.. కాల్పుల్ని షురూ చేశాడు. విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపిన ఉదంతంతో అక్క‌డి వారు షాక్ కు గుర‌య్యారు.

తేరుకొని.. త‌మ‌ను తాము ర‌క్షించుకునే ప్ర‌య‌త్నం చేసే లోపే ముగ్గురు మృత్యువాడ ప‌డ‌గా.. 16 మంది తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో.. ప్రాణ భ‌యంతో ప‌రుగులు తీశారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వెంట‌నే పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి.. ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ దుండ‌గుడు కోసం పోలీసులు గాలింపులు జ‌రుపుతున్నారు. కాల్పుల ఉదంతంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రియాక్ట్ అయ్యారు. దుండ‌గుడు ప‌రారీలో ఉన్నార‌ని.. అత‌డ్ని ప‌ట్టుకునేందుకు పోలీసులు విప‌రీతంగా గాలిస్తున్న‌ట్లు చెప్పారు. దుండ‌గుడు దొరికే వ‌ర‌కూ స్థానిక ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ట్రంప్ హెచ్చ‌రించారు. ఇదిలా ఉంటే.. కాల్పుల చ‌ప్పుళ్ల‌కు ప‌లువురు బాణ‌సంచా కాల్పులుగా తొలుత భావించిన‌ట్లుగా ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు చెబుతున్నారు. పేరొందిన ఫుడ్ ఫెస్టివ‌ల్ పై ఈ త‌ర‌హా దాడి జ‌ర‌గ‌టం ఆందోళ‌న‌కంగా అధికారులు పేర్కంటున్నారు.  


Tags:    

Similar News