వివేకా కేసులో కొత్త మలుపు

Update: 2022-10-10 15:22 GMT
మాజీ మంత్రి, వైఎస్ జగన్ కి సొంత బాబాయ్ అయిన వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక మైన నిర్ణయాన్ని ఈ రోజు తీసుకుంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి విషయంలో సవాల్ చేస్తూ  నిందితులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి పిటిషన్ చేశారు. దస్తగిగి అప్రూవర్ కావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు పిటిషన్ వేశారు.

అయితే ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న ఈ ఇద్దరూ దస్తగిరి విషయంలో ఎలా సవాల్ చేస్తారంటూ సుప్రీం కోర్టు ఈ రెండు పిటిషన్లను కొట్టేసింది. ఇక ఈ కేసుని ఈ నెలాఖరునకు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా వివేకా దారుణ హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారి ఇచ్చిన స్టేట్మెంట్స్ తోనే కధ ముందుకు సాగింది. అలాగే వివేకా వాచ్ మేన్ రంగయ్య కూడా ఈ కేసులో కీలకంగా మారి చాలా విషయాల్లో సీబీఐ అధికారులకు సహకరించారు.

ఇదిలా ఉండగా ఈ కేసులో ఫోటోగ్రాఫర్ కూడా అత్యంత ముఖ్య పాత్ర పొషించారని అంటున్నారు. ఆయనను కూడా సీబీఐ అధికారులు విచారిస్తూ  ముఖ్య సమాచారాన్ని రాబడుతున్నారు. వివేకా హత్య జరిగిన రోజున మొదటిసారిగా ఆ ఫోటోగ్రాఫర్ ఫోటోలను తీయడం ద్వారా సీబీఐ కళ్లలో పడ్డారు. దాంతో ఆయన వద్ద నుంచి కీకలమైన వివరాలను సేకరిస్తున్నారు అని తెలుస్తోంది.

అదే విధంగా ఈ మధ్య కాలం ఆగిన ఈ విచారణ ఆరు నెలల తరువాత తిరిగి విచారిస్తున్నారు. ఇక ఈ కేసు విషయంలో వాస్తవాలు బయటకు రావాలీ అంటే కనుక వేరే రాష్ట్రానికి కేసుని బదిలీ చేయాలని వివేకా కుమార్తె సునీత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద ఈ నెలాఖరులో విచారణ సందర్భంగా కోటు నిర్ణయం తీసుకుంటుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

మొత్తం మీద వివేకా దారుణ హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన కీలక సమాచారంతోనే సీబీఐ అడుగులు పడుతున్నాయి. కోర్టు సైతం ఆయన్ని అప్రూవర్ గా ఉండడాన్ని ఎలా సవాల్ చేస్తారు అంటూ సహ నిందితులను ప్రశ్నించడంతో  ఈ కేసులో అసలైన నిజాలు తొందరలో వెలికి చూసే అవకాశం ఉంది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News