ఇప్పటివరకు వచ్చిన కొవిడ్ వేరియంట్లు అన్నిటిలో అత్యంత ప్రమాదకరమైనది ‘‘డెల్టా’’. మన దేశంలోనే పుట్టిందిది. ఫస్ట్ వేవ్ అనంతరం మహారాష్ట్ర్రలో కొవిడ్ నిబంధనలను పూర్తిగా విస్మరించారు. అదే సమయంలో పండుగలు రావడంతో జన సంచారం బాగా పెరిగింది. ఈ క్రమంలో డెల్టా వేరియంట్ పుట్టుకొచ్చింది. 2020 అక్టోబరు- నవంబరు మధ్య డెల్టా జననం మొదలైంది.
ఫిబ్రవరి నాటికిఉనికి బలంగా మారింది. ఫస్ట్ వేవ్ లో ఎక్కడైతే వైరస్ తీవ్రత మొదలైందో.. ఈసారీ అదే పుణెలో దాడి మొదలైంది. సెకండ్ వేవ్ గా మారింది. మార్చి నాటికి తీవ్రమై.. ఏప్రిల్ , మే నెలల్లో విశ్వరూపమే చూపింది. అధికారికంగానే 2 లక్షల పైగా ప్రాణాలు బలిగొంది. కానీ, అనధికారికంగా పది లక్షల మంది చనిపోయి ఉంటారని అంచనా. అయితే, మే నెల అనంతరం క్రమంగా తీవ్రత తగ్గింది.
మరోవైపుడిసెంబరు నాటికి దేశంలో కొవిడ్ టీకా పంపిణీ బాగా పెరగడం, డెల్టా బలహీనపడడంతో అంతా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని భావించారు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమైక్రాన్ హడలెత్తించింది. దాదాపు నెల రోజులు దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. మళ్లీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణానికి వస్తున్నాయి. అందుకనే పరిస్థితుల ఆధారంగా కొవిడ్ ఆంక్షల ఎత్తివేతను పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది. కేంద్ర ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును పునరుద్ధరించింది.
ముప్పులో డెల్టా.. వ్యాప్తిలో ఒమైక్రాన్ ఇప్పటివరకు వచ్చిన వేరియంట్లలో వ్యాప్తి అత్యంత ఎక్కువగా ఉన్నది ఒమైక్రాన్. డెల్టా కంటే ఇది 70 రెట్లు అధిక వేగంతో వ్యాపిస్తుందని నిపుణులు నిర్ధారించారు. అయితే, దీనికి వ్యాప్తి వేగమే కానీ.. తీవ్రత లేదు. అదే డెల్టా మాత్రం వ్యాప్తి వేగం తక్కువ. తీవ్రత చాలా ఎక్కువ. డెల్టా అక్టోబరులో పుట్టి పతాక స్థాయికి చేరేందుకు నాలుగు నెలల పైగా పట్టింది. కానీ, ఒమైక్రాన్ నెల రోజుల్లోపే పతాక స్థాయికి చేరి పడిపోయింది.
ఒకవేళ డెల్టా తీవ్రత ఒమైక్రాన్ కు గనుక ఉండి ఉంటే మానవాళి చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని ఉండేది. పదుల లక్షల సంఖ్యలో మరణాలు సంభవించేవి. కాగా, డెల్టా గొంతులోంచి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి.. శ్వాస ప్రక్రియను స్తంభింపజేస్తుంది.
అందుకనేసెకండ్ వేవ్ సమయంలో దేశంలో ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఏర్పడింది. అయితే, ఒమైక్రాన్ మాత్రం అలా కాదు. గొంతులోనే ఉండిపోతుంది.అందుకనే థర్డ్ వేవ్ లో మరణాలు లేవు. కేసులు మాత్రమే అధిక సంఖ్యలో నమోదయ్యాయి.
రెండూ కలిసి.. నిజమేనా? వాస్తవానికి థర్డ వేవ్ గరిష్ఠంగా ఉన్న సమయంలోనే డెల్మిక్రాన్ (డెల్టా + ఒమైక్రాన్) వేరియంట్ వచ్చేసిందని కథనాలు వచ్చాయి. కానీ, ఇవి నిర్ధారణ కాలేదు. కేవలం కొవిడ్ స్పైక్ ప్రొటీన్ ను .. కేసుల ‘‘ స్పైక్’’అని తప్పుగా అర్థం చేసుకోవడంతో వచ్చింది ఈ తంటా.
అవన్నీ పక్కనబెడితే ఇప్పడు ప్రపంచమంతా కొవిడ్ తీవ్రత గురించి ఆలోచించడం పక్కనపెట్టింది. ఈ సమయంలో డెల్టాక్రాన్ (డెల్టా +ఒమైక్రాన్) చర్చ నడుస్తోంది. ఈ హైబ్రిడ్ వేరియంట్ డెల్టా, ఒమిక్రాన్ లక్షణాలను ప్రదర్శిస్తోంది. యూకేలో కొవిడ్ పాజిటివ్ నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా డెల్టాక్రాన్ లక్షణాలను గుర్తించారు.
ఈ విషయాన్ని అక్కడి హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(హెచ్‌ఎస్‌ఏ)వెల్లడించింది. ఈ వేరియంట్ బారినపడిన వ్యక్తుల్ని గుర్తించిన తర్వాత వేరియంట్‌ను పర్యవేక్షిస్తామని హెచ్‌ఎస్‌ఏ అధికారులు తెలిపారు. డెల్టాక్రాన్ వ్యాప్తి, తీవ్రత గురించి వారి నుంచి అధికారిక స్పందన రాలేదు. మొదట ఈ వేరియంట్‌ను ఐరోపా దేశం సైప్రస్‌లో గుర్తించారు. అయితే పలు ప్రముఖ కథనాలు దీన్ని ల్యాబ్ తప్పిదం (ఎర్రర్) అంటూ తోసిపుచ్చాయి. అయితే దీనిని గుర్తించిన పరిశోధకుడు మాత్రం తన వాదనను సమర్థించుకున్నారు.
అదే జరిగితే అనూహ్యమే..పైన చెప్పుకొన్నట్లు డేంజరస్ డెల్టా.. ఫాస్టెస్ట్ ఒమైక్రాన్ కలిసి డెల్టాక్రాన్ గా ఏర్పడి.. దానికి డెల్టా, ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందే గుణం గనుక ఉండి ఉంటే చాలా పెద్ద ముప్పే. డెల్టా లోని తీవ్రత, ఒమిక్రాన్ లోని వ్యాప్తి.. ఆ రెండు లక్షణాలు కలిపి డెల్టాక్రాన్ లో ఉన్నాయంటే మహోపద్రమే. డెల్టాక్రాన్ ప్రమాదకారి అంటూ హెచ్ఎస్ఏ హెచ్చరించింది. ఈ వేరియంట్ బారిన పడిన వ్యక్తుల్ని గుర్తించి, ఆ తర్వాత దాని ప్రభావాన్ని అంచనా చేస్తున్నామని హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు చెబుతున్నారు.
ఈ వేరియంట్ తొలిసారిగా ఐరోపాలోని సైప్రస్ లో గుర్తించారట. కొంతమంది ఈ వేరియంట్ లేదని ప్రచారం చేస్తున్నా.. దీన్ని కనిపెట్టానని చెబుతున్న సైంటిస్ట్ మాత్రండెల్టా, ఒమిక్రాన్ కంటే ఇది వేగంగా వ్యాపిస్తుందని, అందుకే డెల్టాక్రాన్ అనే పేరు పెట్టామంటున్నారు. ఇది నిజంగా డెల్టా వేరియంట్ టైపులో ప్రపంచాన్ని వణికిస్తుందా లేక ఒమిక్రాన్ తరహాలో అంతగా ప్రభావం చూపించదా అనే విషయం రాబోయే రోజుల్లో జరగబోయే పరిశోధనల్లోతేలిపోతుంది.