యువ‌రాజు మీద రాజ‌ద్రోహం కేసు!

Update: 2016-02-18 04:25 GMT
ఉత్సాహం మంచిదే. కానీ.. అత్యుత్సాహం ఏమాత్రం మంచిది కాదు. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో రోహిత్ అనే విద్యార్థి ఆత్మ‌హ‌త్య ఇష్యూ మీద‌న సాగిన ర‌గ‌డ‌తో గ‌రిష్ఠంగా రాజ‌కీయ ల‌బ్థి పొందిన కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.. దాదాపు అలాంటి మైలేజే మ‌రోసారి పొందాల‌ని ప్ర‌య‌త్నించి బొక్కబోర్లా ప‌డ‌టం గ‌మ‌నార్హం. రోహిత్ ఆత్మ‌హ‌త్య ఉదంతంలో తొలుత ఉగ్ర‌వాది యాకూబ్ మెమ‌న్ ఉరితీత‌కు వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేపట్ట‌టం.. అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో రోహిత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

జేఎఎన్ యూ ఘ‌ట‌న‌కు.. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఘ‌ట‌న‌కు మ‌ధ్య పెద్ద తేడా ఏమీ లేదు. హెచ్‌ సీయూ ఇష్యూలో యాకూబ్ మెమ‌న్ అయితే.. జేఎన్‌యూ ఇష్యూలో  ఉగ్ర‌వాది అఫ్జ‌ల్ గురు పేరుతో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. హెచ్‌ సీయూలో రోహిత్ ఆత్మ‌హ‌త్య కార‌ణంగా అత‌గాడు యాకూబ్ మెమ‌న్ ను స‌మ‌ర్థించే విష‌యం పెద్ద‌గా చ‌ర్చ‌కు రాలేదు.

కానీ.. జేఎన్ యూ ఇష్యూలో అఫ్జ‌ల్ గురు సంస్మ‌ర‌ణ స‌భ‌ను నిర్వ‌హించిన క‌న్నయ్య పై కేసు న‌మోదు చేసి.. అరెస్ట్ చేయ‌టం తెలిసిందే. హెచ్‌ సీయూ ఇష్యూలో మాదిరి జేఎన్‌యూలో కూడా మైలేజీ సంపాదించొచ్చ‌న్న ఆత్రుత‌లో తొంద‌ర‌ప‌డ్డ రాహుల్‌.. అస‌లు విష‌యాన్ని స్ట‌డీ చేయ‌టంతో దొర్లిన త‌ప్పు.. ఇప్పుడు అత‌డి ప‌ర‌ప‌తిని విప‌రీతంగా దెబ్బ తీస్తోంది. ఒక జాతీయ పార్టీకి కీల‌క నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న వ్య‌క్తి.. ఉగ్ర‌వాదికి అనుకూలంగా మాట్లాడ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న‌కు కాంగ్రెస్ నేత‌లు సూటిగా స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా జేఎన్‌యూలో రాజ‌ద్రోహానికి పాల్ప‌డిన వ్య‌క్తుల‌పై పోలీసు చ‌ర్య‌ను రాహుల్ వ్య‌తిరేకించ‌టం ఆయ‌న‌కు ఇబ్బందిక‌రంగా మారనుంది. ఎందుకంటే.. రాహుల్ మీద రాజ‌ద్రోహం కేసును విచారించేందుకు అల‌హాబాద్ కోర్టు అంగీక‌రించ‌టం యువ‌రాజుకు ఇబ్బంది క‌లిగించే అంశంగా చెప్పొచ్చు. కాంగ్రెస్ యువ‌రాజు మీద వేసిన పిటీష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించాల‌ని కోర్టు నిర్ణ‌యించ‌టం రాహుల్ కు.. కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందిక‌ర‌మే.
Tags:    

Similar News