ఏపీలో కలకలం... గ్రామ వాలంటీర్ల విందు చిందు!

Update: 2020-04-23 10:10 GMT
కరోనా కష్టకాలంలో ఏపీలోని గ్రామ వాలంటీర్లు ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ అనుమానితులను గుర్తించడంతో పాటు - గ్రామాల్లోని ప్రజల్లో వైరస్‌ పై అవగాహన కల్పించడంతో సహా పలు కార్యక్రమాల్లో యాక్టివ్‌ గా పని చేస్తున్నారు. అయితే కొంతమంది గ్రామ వాలంటీర్లు మాత్రం లాక్ డౌన్ రూల్స్ బేఖాతర్ చేస్తున్నారు  ...వారి వల్ల మిగిలిన వాలంటీర్ల కి కూడా చెడ్డ పేరు వస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ వ్యవస్థ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు అదుపుతప్పి ప్రవర్తిస్తున్నారు. విశాఖలోని ఏటికొప్పాకకు చెందిన ఓ గ్రామ వాలంటీర్ పుట్టినరోజు కావడంతో మామిడి తోటలో పార్టీ ఇచ్చాడు. తనతో పాటుగా పనిచేస్తున్న 11 మంది గ్రామ వాలంటీర్లు ఈ పార్టీకి హాజరయ్యారు. మామిడి తోటలో ఏర్పాటు చేసిన విందులో వీళ్ళు పాల్గొన్నారు. అక్కడ  సామజిక దూరం పాటించలేదు. ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదు. అనంతరం వారందరూ కాసేపు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.

ఇక అదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రూరల్ ఎస్ ఐ వీరిపై కేసు నమోదు చేశారు. విశాఖలో జరిగిన ఈ ఉదంతంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా నియంత్రణలో గ్రామ వలంటీర్లు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని సీఎం జగన్‌ చెబుతుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం ఇదీ వారి పనితీరు అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదేమైనా కరోనా నియంత్రణలో అహర్నిశలు కష్టపడుతున్న సీఎం జగన్ కి కూడా ఇలాంటి వారి వల్ల చెడ్డపేరు వస్తుంది.




Tags:    

Similar News