పొగిడించుకోవడం పెద్ద విషయం కాదు. మనల్ని తప్పు పట్టిన వారితో ప్రశంసలు పొందడంలో అంటే అది కచ్చితంగా ల్యాండ్ మార్క్ అన్నట్టే. రాజకీయ ప్రేరేపిత పిటిషన్ల అనంతరం జగన్ మీద నమోదైన కేసుల్లో భాగంగా జగన్ ను విచారించిన సీబీఐ అప్పటి జేడీ... లక్ష్మీనారాయణ జగన్ వల్లే పాపులర్ అయ్యారు. సీబీఐ నుంచి బదిలీ అయ్యి పుణె నగరానికి సేవలు అందించి ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ పొంది... పార్టీ పెడదాం అనుకుని మళ్లీ వెనక్కు తగ్గి జనసేనలో చేరారు. కట్ చేస్తే... వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన ఆయన తాజాగా జగన్ మీద ప్రశంసలు కురిపించారు. అది కూడా తన పార్టీ అధినేత ఏ విషయంలో జగన్ ను తప్పు పట్టారో అదే విషయంలో జేడీ జగన్ ను పొగడటం విశేషం.
వివరాల్లోకి వెళ్తే... రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోకుండా - తాత్కాలిక నష్టాలను ఇగ్నోర్ చేస్తూ జగన్ ఒక్కొక్క వ్యవస్థనీ సంపూర్ణంగా అధ్యయనం చేసి అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టే మద్యపాన నిషేధం దశల వారీగా విధించడానికి చర్యలు మొదలుపెట్టారు. తొలి విడతలో అన్ని ప్రైవేటు మద్యం లైసెన్సులు బంద్ చేసి... వైన్ షాపులను ప్రభుత్వం చేతిలోకి తీసుకుంది. తద్వారా బెల్టు షాపులను సమూలంగా నిర్మూలించారు. మద్యం దుకాణాలకు టార్గెట్లు కూడా లేవు. పైగా మునుపటి కంటే దుకాణాల సంఖ్యను తగ్గించారు. దీంతో మద్యం అమ్మకాలు పూర్తిగా ప్రభుత్వ చేతిలోకి వచ్చాయి. అనంతరం వాటిని మెల్లగా తగ్గిస్తూ పోయి ఐదేళ్లలో సమూలంగా నిర్మూలించాలన్నది జగన్ ఆలోచన. కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అందుబాటులో ఉండేలా చేసి ప్రభుత్వానికి కూడా ప్రత్యామ్నాయ ఆదాయాన్ని సృష్టించాలన్నది జగన్ ఆలోచన.
ఈ మద్య నిషేధం సాధ్యంకాదని ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. దశల వారీ విధానాన్ని వ్యతిరేకించారు. కానీ అదే పార్టీలో కీలక వ్యక్తి అయిన జేడీ లక్ష్మీనారాయణ ఏపీ మద్యం పాలసీపై ప్రశంసలు కురిపించి అందరి ఆశ్చర్యపరిచారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ‘‘ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఫలితాలు సాధిస్తాయని అన్నారు. మద్య పాన నిషేధం దిశగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు. మద్యపాన నిషేధం సమాజానికి కచ్చితంగా మేలు చేసే ముఖ్య నిర్ణయం‘‘ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గురించి జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.