ఆవులు అన్నా.. గోమూత్రం, గోపేడ అన్న హిందువులకు పరమ పవిత్రం. చాలా రోగాలకు ఆవు మూత్రం, పేడ మందుగా వాడుతారు. ఇప్పటికే ఎన్నో ఔషధాల తయారీలోనూ వినియోగిస్తారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్రీయ కామథేను ఆయోగ్ అనే సంస్థ ఆవుపేడతో చిప్ తయారు చేసింది. అంతేకాదు ఈ చిప్ తో రేడియేషన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని కూడా చెబుతోంది. ఇది శాస్త్రీయంగా నిరూపణ అయ్యిందని సంస్థ చీఫ్ కటారియా చిప్ విడుదల సందర్భంగా ప్రకటించారు.
దేశవ్యాప్తంగా గోవధను అరికట్టడం.. గోవుల సంరక్షణ చేపట్టేందుకే వీటి ఉత్పత్తులను శాస్త్రీయంగా నిర్ధారించి ప్రోత్సహించేందుకు కేంద్ర పశుసంవర్ధక శాఖ ‘రాష్ట్రీయ కామథేను ఆయోగ్’ సంస్థను ఏర్పాటు చేసింది.
ఆవుపేడ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. కిలో రూ.2 చొప్పున కొనుగోలు చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రప్రభుత్వానికి విధివిధానాలు సిఫారసు చేసింది.
చత్తీస్ గఢ్ ప్రభుత్వం గోధన్ న్యాయ్ యోజన పేరుతో ఆవు పేడను కిలో రూ.2కు కొంటోంది. దాన్ని వర్మీ కంపోస్టుగా మార్చి రూ.8కి కిలో చొప్పున రైతులకు విక్రయిస్తోంది.
అదే తరహాలో ఈ విధానాన్ని దేశమంతా అమలు చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.