భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలించిన కేంద్రం

Update: 2022-02-27 05:30 GMT
ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 219 మంది ముంబై చేరుకోగా.. మరో విమానంలో 250 మంది భారత్ కు చేరుకున్నారు. మొత్తం 600 మంది వరకూ భారత్ కు విద్యార్థులు వచ్చారు.

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ నిర్వహిస్తోంది. రెండో విమానం రుమేనియా రాజధాని బుఖారెస్ట్ నుంచి బయలుదేరింది.  ఇక రెండో విమానంలో 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జై శంకర్ వెల్లడించారు. ఉక్రెయిన్లో ఉన్న భారత విద్యార్థులను సరిహద్దుల వద్దకు తరలించి రుమేనియా మీదుగా భారత్ కు తరలిస్తున్నారు.

తొలుత 219 మంది విద్యార్థులను రోమేనియా నుంచి విమానంలో భారత్ కు తీసుకువచ్చారు. ఆ విమానం ముంబైలో ల్యాండ్ అయ్యింది.  ఉక్రెయిన్ గగనతలంపై నిషేధం ఉండడంతో పక్క దేశం రొమేనియా నుంచి కాలినడకన/ వాహనాల్లో విద్యార్థులను తరలించి భారత్ కు తీసుకొస్తున్నారు.

ఇక విద్యార్థులకు పరీక్ష చేయడం.. వ్యాక్సినేషన్, ఆహారం సహా అన్ని ఖర్చులను తామే భరిస్తామని ముంబై మేయర్ కిశోర్ పండేకర్ తెలిపారు. భారత్ చేరుకున్న వారందరికీ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు.

రొమేనియా నుంచి భారత్ కు తీసుకొచ్చేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా మానిటర్ చేశారు. వారిని తీసుకొచ్చేందుకు నిరంతరం శ్రమించామని తెలిపారు.  తమను సంప్రదించకుండా సరిహద్దులు దాటొద్దని అధికారులు విద్యార్థులకు సూచించారు. ఈ మేరకు సమన్వయం చేసుకొని ముందడుగు వేశారు.

ఇక నిన్న 40 మంది భారత విద్యార్థులు కాలినడకన 8 కి.మీలు నడిచి పోలెండ్ సరిహద్దు వద్దకు చేరుకున్నారు. భారత విద్యార్థులను వర్సిటీకి చెందిన ఓ బస్సు 70 కి.మీల దూరం తీసుకొచ్చింది. పోలెండ్ సరిహద్దుకు 8 కి.మీల దూరంలో విడిచిపెట్టింది. వారందరూ కాలినడకన చేరుకున్నారు. భారత విదేశఈ వ్యవహారాల శాఖ సరిహద్దుల్లో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసింది. పోలెండ్ వెళ్లాలనుకునే భారత విద్యార్థులకు అక్కడి అధికారులు సహకరిస్తున్నారు.
Tags:    

Similar News