మనిషన్నాక కాస్త భయం ఉంటుంది. కానీ.. ఏపీ బీజేపీ నేతలు బరితెగించేసినట్లుగా ఉంది. తమను ఎన్నుకున్న ప్రజలకు జరగాల్సిన న్యాయం కోసం పోరాడకపోయినా ఫర్లేదు. వారి ప్రయోజనాలు దెబ్బ తినేలా మాట్లాడేందుకు ఏ మాత్రం జంకటం లేదు. తమకు పార్టీ తప్పించి ప్రజలు ఏమైపోయినా ఫర్లేదన్న భావన వారిలో కనిపిస్తోంది.
ప్రజల మైండ్ సెట్ కు తగ్గట్లుగా నేతలు తమ మాటల్ని మార్చుకోవటం కనిపిస్తుంది. కానీ.. ఏపీ బీజేపీ నేతల్లో అలాంటిదేమీ కనిపించటం లేదు సరికదా.. అధిష్ఠానానికి వీర విదేయులమన్న విషయాన్ని ఏపీ అసెంబ్లీ సాక్షిగా ప్రదర్శించుకోవటానికి సైతం వెనుకాడలేదు. ఓపక్క ఏపీకి ఇస్తామన్న ప్రత్యేకహోదా హామీని నిలబెట్టుకోకున్నా.. ఏపీ రాజధాని అమరావతిని ఢిల్లీని తలదన్నేలా తమ నేత మోడీ స్వయంగా చేసిన వ్యాఖ్యను గుర్తు పెట్టుకోకుండా అడ్డగోలుగా మాట్లాడేస్తున్నారు.
తాజాగా ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. హోదా వస్తే ఏదో జరిగిపోతుందని చెప్పటం సరికాదని చెప్పటమే కాదు.. ప్రత్యేక హోదా ఏపీకి అవసరమే లేదన్నట్లుగా వాదన వినిపించటం గమనార్హం. ప్రత్యేకహోదాను కొన్ని రాష్ట్రాలకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్న వాదన నిజం కాదని.. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను పొడిగించలేదని తేల్చి చెప్పారు.
రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధించేందుకు కేంద్రం సహకరిస్తుందన్న మాటను చెప్పిన ఆకుల.. విభజన చట్టంలో లేనివి కూడా మోడీ సర్కారు ఇచ్చిందంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఏపీ నడిగడ్డ మీద ఏపీ ప్రజల ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా.. మాట్లాడిన ఆకుల తీరు చూస్తే.. తమకు ఓటేసిన ప్రజల కంటే పార్టీనే ముఖ్యమన్న విషయాన్ని తేల్చి చెప్పినట్లుగా చెప్పక తప్పదు. ఇలాంటి నేతలకు తగినశాస్తి చేయాల్సిన అవసరం ఏపీ ప్రజల మీదనే ఉంది.