జ‌మ్మూక‌శ్మీర్ కు మ‌ళ్లీ పాత హోదా ఇవ్వ‌నున్న కేంద్రం..?

Update: 2021-06-14 00:30 GMT
జ‌మ్మూ క‌శ్మీర్ కు కేంద్రం మ‌ళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వ‌బోతోందా? అక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని యోచిస్తోందా? అంటే.. అవును అనే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదుగానీ.. కేంద్రం ఆ వైపుగా ఆలోచ‌న‌లు చేస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

జ‌మ్మూక‌శ్మీర్ కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి హోదా క‌ల్పించే రాజ్యాంగంలోని 370 ఆర్టిక‌ల్ ను 2019లో ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలోనే రాష్ట్ర హోదా ర‌ద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్ర‌క‌టించింది. అయితే.. ఇప్పుడు ఆ నిర్ణ‌యం మార్చుకోబోతోంద‌ని స‌మాచారం.

మ‌ళ్లీ రాష్ట్ర‌హోదా ఇచ్చేసి, అక్క‌డ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని చూస్తోంద‌నే క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. 2018లో మెహ‌బూబా ముఫ్తీ పార్టీతో పొత్తు చెడిన త‌ర్వాత కేంద్రం అక్క‌డ రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచీ అక్క‌డ రాజ‌కీయ కార్య‌క‌లాపాలు స్తంభించాయి. ఆ త‌ర్వాత 370 ర‌ద్దు అంశంతో ప‌రిస్థితులు మ‌రింత‌ సున్నితంగా త‌యార‌య్యాయి.

అయితే.. 2019 సాధార‌ణ ఎన్నిక‌ల సంద‌ర్భంగానే అక్క‌డ కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్రం ప్ర‌య‌త్నించింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ.. అక్క‌డి ప‌రిస్థితుల దృష్ట్యా వెన‌క‌డుగు వేసింద‌ని అంటున్నారు. ఇప్పుడు ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌డంతో.. అన్ని పార్టీల‌తో సంప్ర‌దింపులు జ‌రిపి, రాష్ట్ర హోదా ఇవ్వ‌డం.. ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం.. వంటి చ‌ర్య‌ల‌కు సిద్ధం కానుంద‌ని తెలుస్తోంది.







Tags:    

Similar News