కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ కరెన్సీగా అన్ని దేశాల్లో వాడుకలో ఉన్న ‘క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్’ను నిషేధించకపోవచ్చునని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో బిట్ కాయిన్, ఇతర కరెన్సీలను నిషేధించకపోవచ్చునని తెలిపారు.
ప్రపంచంలోని అన్ని రకాల కరెన్సీలకు ప్రత్యామ్మాయంగా క్రిప్టో కరెన్సీ అందుబాటులో ఉందని..తాము నిర్ధారించుకోవాలనుకుంటున్నట్లు నిర్మల తెలిపారు. దీన్ని కలిగి ఉండరాదని తాము చెప్పడం లేదని స్పష్టం చేశారు. దీన్ని బట్టి క్రిప్టో కరెన్సీపై దేశంలో నిషేధం లేదని ఆమె పరోక్షంగా హింట్ ఇచ్చారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీకి రెక్కలు వస్తున్నాయి. దీని ధర జెట్ స్పీడులా పరిగెడుతోంది. క్రిప్టో బిట్ కాయిన్ విలువ ఆదివారం 4.18శాతం పెరిగి ఏకంగా 50974 డాలర్ల వద్ద ట్రేడ్ కావడం గమనార్హం. కిందటి సెషన్ తో పోలిస్తే దీని ధర 2043 డాలర్లకు పెరిగింది.గత ఏడాది జనవరి 4న క్రిప్టో కరెన్సీ 27734 డాలర్ల వద్ద ఉండి ప్రపంచ అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా నిలిచింది. ఆ తర్వాత 83.7 శాతం లాభపడి 58354 డాలర్లకు చేరింది. తాజాగా కొంచెం క్షీణించి 50వేల డాలర్లకు పడిపోయింది.
ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ ప్రకారం.. బిట్ కాయిన్ వ్యాల్యూ మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిట్ కాయిన్ వ్యాల్యూ ఆల్ టైం గరిష్టం 58000 నుంచి 38శాతం క్షీణించింది. తిరిగి మళ్లీ 50వేలకు చేరింది.బిట్ కాయిన్ కొనుగోలు పెరగడంతో 2021 మార్చి 1వ తేదీ నాటికి దీని మార్కెట్ వాటా 61.11శాతంగా నమోదైంది.