ఆందోళ‌న వేడి త‌గిలింది.. నిధులు విడుద‌ల‌

Update: 2018-02-10 05:05 GMT
గ‌డిచిన నాలుగు రోజులుగా లోక్ స‌భ‌ను స్తంభింప‌చేయ‌టంలో తెలుగు ఎంపీలు స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి. ఏపీకి జ‌రుగుతున్న అన్యాయాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చెప్ప‌ట‌మే కాదు.. లోక్ స‌భ‌లోని స‌భ్యులంతా ఏపీకి ఎన్ని ఇబ్బందులు అన్న భావ‌న క‌లిగేలా చేయ‌టంలో స‌క్సెస్ అయ్యారు.

ఏపీ విష‌యంలో అదే ప‌నిగా మోడీ స‌ర్కారు అన్యాయానికి గురి చేస్తుంద‌న్న‌భావ‌న అంద‌రిలో క‌లిగేలా చేయ‌టంతో మోడీ స‌ర్కారుపై ఒత్తిడి అంత‌కంత‌కూ పెరిగింది. మిత్ర‌ప‌క్షంగా ఉంటూ ఇంత ఘాటుగా రియాక్ట్ కావ‌టం మోడీ స‌ర్కారును డిఫెన్స్ లో ప‌డేసేలా చేసింది. ఈ కార‌ణంతోనే కావొచ్చు.. శుక్ర‌వారం బ‌డ్జెట్ స‌మావేశాలు తాత్కాలికంగా ముగిసిన నేప‌థ్యంలో.. ఏపీకి చిన్న శుభ‌వార్త‌ను తీసుకొచ్చి హాట్ హాట్ గా ఉన్న ఎంపీల్ని కూల్ చేసే ప్ర‌య‌త్నం ఒక‌టి చేశారు.

14వ ఆర్థిక సంఘం నిధుల కింద ఏపీకి రూ.369 కోట్లు కేటాయించిన‌ట్లు వెల్ల‌డించ‌టంతో పాటు.. జాతీయ ఉపాధి హామీ నిధుల కింద రూ.31.76 కోట్లు విడుద‌ల చేసిన వైనాన్ని వెల్ల‌డించారు. అయితే.. తాజాగా విడుద‌ల చేసిన నిధుల విష‌యంలో ఏపీ ఎంపీలు ఎలాంటి ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

అర‌కొర నిధుల‌కే సంతోష‌ప‌డిపోతే.. మొత్తానికే మొండిచేయి చూపించే ప్ర‌మాదం ఉంద‌న్న ఉద్దేశంతో పాజిటివ్ గా రియాక్ట్ కాలేద‌ని చెబుతున్నారు. తాము విడుద‌ల చేసే నిధుల‌తో ప‌రిస్థితి ఎంతోకొంత సానుకూలంగా మారుతుంద‌ని భావించిన బీజేపీ నేత‌ల‌కు తాజా ప‌రిణామాలు అసంతృప్తికి గురి చేస్తున్నాయి. బిస్కెట్ల‌కు ఆశ‌ప‌డితే.. మొత్తానికే మోసం వ‌స్తుంద‌న్న ఉద్దేశంతో ఉన్న ఏపీ నేత‌లు.. అధికారులు తాజాగా రిలీజ్ చేసిన నిధుల విష‌యంలో సానుకూలంగా స్పందించ‌లేద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News