కేంద్రంలోని మోడీ సర్కారు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా.. ఎలాంటి ఆదేశాల్ని జారీ చేసినా.. అదంతా దేశం కోసం ధర్మం కోసమన్న పాట పాడటం ఈ మధ్యన మరింత ఎక్కువైంది. వారి మాటల్నే పంచ్ లుగా తీసుకొని.. కమలనాథుల్ని ఆడేసుకుంటున్నారు. దీనికి తగ్గట్లే వారి నిర్ణయాలు కూడా ఉన్నాయని చెప్పాలి. దేశంలో అత్యధికంగా పసుపు పండించే రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నాఫలితం లేని పరిస్థితి. ఆ మాటకు వస్తే ఎంపీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఓటమికి పసుపు బోర్డు ఏర్పాటులో జరిగిన జాప్యమేనని చెప్పాలి.
తనను ఎంపీగా గెలిపిస్తే.. కేంద్రంలోని మోడీ సర్కారుతో మాట్లాడి పసుపు బోర్డు ఖాయంగా ఏర్పాటు చేయిస్తానని చెప్పిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇచ్చిన హామీని ఇప్పటికి నెరవేర్చలేదు. ఎంపీ ఎన్నికల సందర్భంగా ఆయన రైతులకు హామీ ఇస్తూ.. ఒకవేళ తాను పసుపు బోర్డు తేలేని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా టీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా బదులిచ్చారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.
తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఆయన కుండ బద్ధలు కొట్టేశారు. నిజామాబాద్ లో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసినందున.. పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదని చెప్పారు. పసుపు.. ఇతర సుగంధ ద్రవ్యాల ఎగుమతుల ప్రోత్సాహం కోసం వరంగల్.. నిజామాబాద్.. హైదరాబాద్.. ఖమ్మంలలో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయాలు పని చేస్తున్నట్లు చెప్పారు.
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. నిజామాబాద్ లో పసుపుబోర్డు ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా లేదన్న మాటపై టీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. దేశం కోసం ధర్మం కోసం బీజేపీ మరోకీలక నిర్ణయాన్ని తీసుకుందని.. పసుపుబోర్డును తెలంగాణకు ఇచ్చేది లేదని వ్యవసాయ మంత్రి పేర్కొన్నారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మాటలకు తెలంగాణ బీజేపీ నేతలు ఏ విధంగా సమాధానం ఇస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.