ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో అడిగన ప్రశ్నకు ఆ పార్టీకి షాకిచ్చే ఆన్సర్ వచ్చింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా ఆయన సమాధానం ఇచ్చారు.
ముందుగా తన ప్రశ్నలో ఏపీ ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేశారు గల్లా జయదేవ్. ఏపీకి మూడు రాజధానులు అని ఏపీ ప్రభుత్వం అంటోందని, దీని వల్ల పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతున్నాయని, రైతులకు అన్యాయం జరుగుతూ ఉందని.. తమ ఆరోపణలను తన ప్రశ్నలో కూడా గుప్పించారు జయదేవ్. రాతపూర్వకంగా అడిగిన ఈ ప్రశ్నకు రాతపూర్వకంగానే సమాధానం వచ్చింది. ఈ మేరకు నోట్ విడుదల అయ్యింది.
ఏపీ రాజధాని అమరావతి అని కేంద్ర మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 2015 ఏప్రిల్ 23న ఆ మేరకు జీవో ఇచ్చారని కేంద్ర మంత్రి వివరించారు. ఒక రాష్ట్ర రాజధాని అనేది ఆ రాష్ట్రం పరిధిలో ఎక్కడైనా ఉండవచ్చని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. సూటిగా, క్లుప్తంగా ఉంది ఈ సమాధానం. గత కొన్నాళ్లు గా మీడియా వర్గాల్లో ఏపీ మూడు రాజధానుల అంశం గురించి వార్తలు వస్తున్నాయని, ఒక రాష్ట్ర పరిధిలో దాని రాజధాని ఎక్కడైనా ఉండవచ్చని కేంద్ర మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.
ఇలా సూటిగా, క్లుప్తంగా సమాధానం వచ్చింది కేంద్రం నుంచి. రాజధాని అంశంలో తమ జోక్యం ఉండబోదని, రాష్ట్రం పరిధిలో రాజధాని ఎక్కడైనా ఉండవచ్చని చెప్పడం ద్వారా.. తెలుగుదేశం పార్టీకి ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా స్పష్టత ఇచ్చినట్టే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. లోక్ సభలో రాజధాని అంశాన్ని ఎత్తడం ద్వారా రచ్చ రేపాలని తెలుగుదేశం పార్టీ భావించింది. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం నుంచి ఆ పార్టీకి షాకింగ్ రిప్లై వచ్చినట్టుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.